నిన్న సాయంత్రం నుంచే ఎంజీఎం వద్ద మారిపోయిన పరిస్థితులు
Send us your feedback to audioarticles@vaarta.com
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిందని గురువారం సాయంత్రం ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అప్పటి నుంచి ఆసుపత్రి వద్ద హై టెన్షన్ నెలకొంది. అయితే ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని దేశ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంతే కాకుండా నిన్న సాయంత్రం నుంచే బాలు చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆసుపత్రి వద్ద మాత్రం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.
ఎంజీఎంకు నిన్న సాయంత్రమే ప్రముఖ నటుడు కమల్‌హాసన్ వెళ్లగా.. నేడు ప్రముఖ దర్శకుడు, బాలుకి సన్నిహితులు అయిన భారతీ రాజా వెళ్లారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఎంజీఎంకు వెళుతుండటంతో నిన్న సాయంత్రం నుంచే బాలు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. బాలు కుటుంబ సభ్యులంతా కూడా హడావుడిగా ఆసుపత్రి వద్దకు చేరుకోవడం తీవ్ర కలకలాన్ని రేపింది.
మరోవైపు శుక్రవారం ఎస్పీ బాలు నివాసం వద్ద వీధులన్నీ శుభ్రం చేసి, కార్పొరేషన్ సిబ్బంది బ్లీచింగ్ చల్లింది. దీంతో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఉదయం నుంచే అనుమానాలు బలపడుతున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించడం.. హై టెన్షన్ వంటి వాటితో బాలుకి ఏదో జరిగి ఉంటుందనే చర్చ నిన్న సాయంత్రం నుంచే నడుస్తోంది. ఇటీవల కోలుకున్నట్టుగానే ఆయన మరల కోలుకుంటారని చిన్న ఆశ. కానీ బాలు ఇక లేరన్న వార్త రావడంతో యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురయ్యింది.
ఇదీ చదవండి:
లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు
చదువుకుంటూనే పాటలు.. 'మర్యాద రామన్న'తో సినీ ప్రస్థానం
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com