మోహన్‌బాబు కుటుంబ సభ్యులను హెచ్చరించిన దుండగుల అరెస్ట్

  • IndiaGlitz, [Sunday,August 02 2020]

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు ఫాం హౌస్ వద్ద నిన్న రాత్రి కలకలం రేగింది. జల్పల్లిలోని ఆయన ఫాంహౌస్‌లోకి గత రాత్రి ఓ కారు ఆయన ఇంట్లోకి దూసుకెళ్లింది. కారులో నలుగురు వ్యక్తులున్నారు. మిమ్మల్ని వదలబోమంటూ మోహన్‌బాబు కుటుంబ సభ్యులకు హెచ్చరించారు. దీంతో భయాందోళనకు లోనైన మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పహడీషరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీ 3 ఏఎన్ 0004 నంబరున్న ఇన్నోవా కారులో దుండగులు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. .. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు.. కారు నంబర్ ఆధారంగా పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. మైలార్‌దేవులపల్లిలోని దుర్గానగర్‌కు చెందిన యువకులుగా గుర్తించారు. అగంతకుల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది. మోహన్‌బాబు ఇంటి వాచ్‌మెన్ అప్రమత్తంగా లేకపోవడం వల్లే వారు లోనికి వచ్చినట్లు తెలిసింది.