Harassing girls:అమ్మాయిలతో ఏకాంతంగా .. ఫోటోలు, వీడియోలు తీసి వేధింపులు, కర్ణాటకలో కీచకుడు అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
కర్ణాటకలోని శివమొగ్గలో ఫోటోలు, వీడియోలతో వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ జీ.కే మిథున్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తీర్థహళ్లిలో కొందరు అమ్మాయిలపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వీడియో వైరల్ అయినట్లు తెలిపారు. నిందితుడిని ప్రతీక్ గౌడ్‌గా గుర్తించారు. ఇతను ఏబీవీపీలో మెంబర్‌గా తెలుస్తోంది. విషయం వెలుగులోకి రావడంతో ఎన్ఎస్యూఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీక్ గౌడ్‌ను అరెస్ట్ చేయాలంటూ జూన్ 17న తీర్థహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను అమ్మాయిల ఫోటోలు, వీడియోలు తీసి వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు ఏబీవీపీ నేతలు సైతం ప్రతీక్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిని ఈ ఏడాది జనవరిలోనే సంస్థ బాధ్యతల నుంచి తప్పించామని, ప్రతీక్ ఏబీవీపీ పేరును దుర్వినియోగం చేస్తూ పలువురిని వేధించాడని వారు ఫిర్యాదులో తెలిపారు.
ఇదిలావుండగా.. వాట్సాప్‌తో సహా సోషల్ మీడియాలో అసభ్యకరమైన ఫోటోలను వైరల్ చేయడం ఐటీ చట్టం ప్రకారం శిక్షార్హామైన నేరమని శివమొగ్గ పోలీసులు తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి కేసుల్లో నేరం రుజువైన వ్యక్తికి పెనాల్టీతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని తెలిపారు. సైబర్, ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ పోలీసులు ఇలాంటి కార్యకలాపాలపై నిఘా వుంచుతారని హెచ్చరించారు. ఇలాంటి ఫోటోల విషయంలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments