ట్రంప్‌కు ఘన స్వాగతం.. హగ్ ఇచ్చిన మోదీ..
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్‌లో అడుగుపెట్టారు. భారత్‌కు ట్రంప్ రావడం ఇదే తొలిసారి. ప్లైట్ దిగగానే ఆయనకు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలుకుతున్నారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్ ఇండియాకు విచ్చేశారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ‘నమస్తే ట్రంప్’ వేదికకు వారు చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి ‘నమస్తే ట్రంప్’ వేదిక వరకు లక్షలాది మంది కళాకారులు, ప్రజలు రోడ్డుకి ఇరు వైపులా నిలబడి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. మొతెరా స్టేడియం వద్ద కళాకారులు ఆటపాటలతో ప్రజలను అలరిస్తున్నారు.
హగ్ ఇచ్చిన మోదీ!
ఇండియాలో కాలుమోపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అద్భుత రీతిలో స్వాగతం లభించిందని చెప్పుకోవచ్చు. విమానం దిగిన ట్రంప్‌కు మొదటమోదీ, కరచాలనం చేసి హగ్ ఇచ్చారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియాతో కూడా మోదీ కరచాలనం చేశారు. కౌగిలింతతో ఆహ్వానం పలుకగా, ఆపై, భారత సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తూ సాగిన ఆహ్వాన కార్యక్రమం ట్రంప్‌ను అబ్బర పరిచింది. ఆహ్వానం పలికిన వారిలో మోదీతో పాటు యూపీ గవర్నర్ ఆనందీబేన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో త్రివిధ దళాల అధిపతులు ట్రంప్‌కు స్వాగతం పలికారు.
ఆశ్చర్యపోయిన ట్రంప్!
శంఖాలు ఊదుతూ, డప్పు వాయిద్యాలు వాయిస్తూ, సంప్రదాయ నృత్యాలతో, గరగాటాలతో పలువురు ట్రంప్‌కు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారందరినీ ఆశర్చపూర్వకంగా చూస్తూ ట్రంప్ ముందుకు సాగిపోయారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రంప్ తన భార్య, కూతురు, అల్లుడితో కలిసి అహ్మదాబాద్ నుంచి ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్ వీక్షించనున్నారు.
షెడ్యూల్ ఇదీ...
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 22 కిలోమీటర్ల రోడ్ షో
12:45 గంటలకు ప్రపంచంలోనే అతిపెద్ద మొటెరా స్టేడియాన్ని ప్రారంభం.. అక్కడే నమస్తే ట్రంప్ కార్యక్రమం
మధ్యాహ్నం 3:30 గంటలకు ట్రంప్ తన భార్య, కూతురు, అల్లుడితో కలిసి అహ్మదాబాద్ నుంచి ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్ వీక్షిణ
సాయంత్రం 4:45 గంటలకు ట్రంప్, సతీసమేతంగా, కుమార్తె ఇవాంకా, అల్లుడితోసహా ఆగ్రా
సాయంత్రం 5:10 గంటలకు తాజ్ మహల్‌ని సందర్శన
సాయంత్రం 6:45కి తిరుగుపయనం
రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్ పోర్టుకు చేరిక
రాత్రి 8 గంటలకు ఢిల్లీలోని హోటల్ మౌర్యకు.. అక్కడే ట్రంప్ బస
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments