Narendra Modi:మోడీ అమెరికా పర్యటన .. వాషింగ్టన్లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని, వివరాలివే
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి ప్రవాస భారతీయులతోనూ ఆయన సమావేశం కానున్నారు. జూన్ 23న వాషింగ్టన్లో జరిగే కార్యక్రమంలో ‘‘భారతదేశ వృద్ధిలో ప్రవాసుల పాత్ర’’ అన్న అంశంపై మోడీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ఒకరు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ల ఆహ్వానం మేరకు మోడీ అమెరికా రానున్నారు. జూన్ 22న వైట్‌హౌస్‌లో మోడీకి బైడెన్ దంపతులు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇదే పర్యటనలో యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి కూడా మోడీ ప్రసగించనున్నారు. తద్వారా రెండుసార్లు అమెరికా పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించనున్నారు.
పర్యటనలో భాగంగా జూన్ 23 సాయంత్రం అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీ నిర్వహించనున్న కార్యక్రమంలో మోడీ పాల్గొంటారని డాక్టర్ భరత్ బరాయ్ తెలిపారు. గతంలో ఎన్నో ఉన్నత స్థాయి సమావేశాలు జరిగిన ప్రతిష్టాత్మక రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్లో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ వేదికలో 900 మంది కూర్చోవచ్చు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల కోసం వాషింగ్టన్లో నిర్మించిన తొలి ఫెడరల్ బిల్డింగ్.
ప్రధాని పర్యటన నేపథ్యంలో అక్కడ ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 మందితో జాతీయ ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు భరత్ పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌ను యూఎస్ ఇండియా కమ్యూనిటీ ఫౌండేషన్ నిర్వహించనుంది. చికాగోలోని ఓ పెద్ద గ్రౌండ్లో 40 వేల మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. కానీ షెడ్యూలింగ్ సమస్యల కారణంగా అది ఖరారు కాలేదు. అయితే జూన్ 23 సాయంత్రం ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించేందుకు మోడీ అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన భారత్‌కు తిరిగి వెళ్లే అవకాశం వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments