PM Narendra Modi:తారకరత్న కన్నుమూత : మోడీ సంతాపం, నివాళులర్పించిన చంద్రబాబు, ఎన్టీఆర్, విజయసాయిరెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
సినీనటుడు నందమూరి తారకరత్న మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికే జమున, సాగర్, కే విశ్వనాథ్‌ల మరణాల నుంచి కోలుకోకముందే తాజాగా తారకరత్న హఠాన్మరణంతో సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు తారకరత్న మృతికి సంతాపం ప్రకటించగా..కడసారి చూసుకునేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వీఐపీలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు.
తారకరత్న మృతిపై మోడీ దిగ్భ్రాంతి :
ఇకపోతే.. తారకరత్న మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు పీఎంవో ట్వీట్ చేసింది. ‘‘సినిమా, వినోద రంగంలో తారకరత్న తనదైన ముద్రవేశారు. ఆయన మరణం తనను ఎంతగానో బాధించింది. తారకరత్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.. ఓం శాంతి’’ అని ట్వీట్ చేసింది.
తారకరత్న పార్ధీవ దేహానికి చంద్రబాబు, లోకేష్ నివాళి:
అనంతరం టీటీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిలు తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. అంతకుముందు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తారకరత్న నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ వెంటనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణిలు కూడా తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈరోజు తన యువగళం పాదయాత్రకు కూడా లోకేష్ బ్రేక్ అయ్యారు.
సోదరుడి భౌతికకాయాన్ని చూసి ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ భావోద్వేగం:
తారకరత్న భౌతికకాయానికి ఆయన సోదరులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు నివాళులర్పించారు. విగతజీవిగా వున్న తారకరత్న పార్థీవ దేహాన్ని చూసి వారిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను వీరిద్దరూ పరామర్శించారు. ఆ సమయంలో పక్కనే వున్న విజయసాయిరెడ్డితో ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు మాట్లాడారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments