Modi Mother: మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూత, స్వయంగా పాడె మోసిన ప్రధాని.. ముగిసిన అంత్యక్రియలు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రధాని నరేంద్ర మోడీ తల్లీ హీరాబెన్ కన్నుమూశారు. ఆమె వయసు 100 సంవత్సరాలు. రెండ్రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో హీరాబెన్‌ను అహ్మదాబాద్‌లోని యు ఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ హీరాబెన్ తుదిశ్వాస విడిచారు. తల్లి మరణవార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బయల్దేరారు. హీరాబెన్ మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
గాంధీ నగర్ శ్మశాన వాటికలో ముగిసిన అంత్యక్రియలు:
మాతృమూర్తికి నివాళులర్పించిన మోడీ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం గాంధీ నగర్‌లోని హీరాబెన్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. తల్లి పాడెను స్వయంగా ప్రధాని మోశారు. అనంతరం శ్మశాన వాటికలో తన సోదరులతో కలిసి తల్లి అంత్యక్రియలు నిర్వహించారు మోడీ. ఆయన వెంట పలువురు బీజేపీ నేతలు, కుటుంబ సభ్యులు వున్నారు.
ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకున్న హీరాబెన్ :
హీరాబెన్ స్వస్థలం గుజరాత్‌లోని వాద్‌నగర్. భర్త దామోదర్ దాస్ మూల్‌చంద్. ఈ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో ప్రధాని మోడీ మూడవ సంతానం. 2019 ఎన్నికల్లో తన కుమారుడికి ఓటు వేయాలని ఆమె ప్రచారం నిర్వహించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. కొద్దిరోజుల క్రితం హీరాబెన్ తన వందో జన్మదినాన్ని జరుపుకున్నారు. అప్పుడు సోదరుడి నివాసానికి వచ్చిన మోడీ.. తల్లి ఆశీర్వాదం తీసుకుని సరదాగా గడిపారు. అలాగే ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ హీరాబెన్ తన ఓటు హక్కును వినియోగించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments