Narendra Modi: కొత్త నాణేలను విడుదల చేసిన మోడీ.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
2016 నవంబర్ 8న నోట్ల రద్దుతో కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు కొత్త నాణేల శ్రేణిని ఆవిష్కరించారు. అంధులు సైతం వీటిని సులభంగా గుర్తించేలా ప్రభుత్వం వీటిని రూపొందించడం విశేషం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని ఈ నాణేల ప్రత్యేక సిరీస్ను ప్రధాని విడుదల చేశారు.
నాణేలపై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ డిజైన్:
రూ. 1, రూ. 2, రూ.5, రూ.10, రూ. 20 డినామినేషన్లలో ఉండే ఈ నాణేలపై ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (ఏకేఏఎం) డిజైన్ ఉంటుంది. ఇవి స్మారక కాయిన్లు కాదని, చెలామణీలో ఉంటాయని ప్రధాని వెల్లడించారు. అమృత ఘడియల లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పం గురించి నిరంతరం గుర్తు చేసేలా, దేశ అభివృద్ధి కోసం పని చేసేలా ఈ నాణేలు ప్రోత్సహిస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
12 ప్రభుత్వ పథకాలతో జన సమ్మర్ధ్ పోర్టల్:
ఈ సందర్భంగా 12 ప్రభుత్వ పథకాలతో అనుసంధానించిన ‘జన సమ్మర్థ్ పోర్టల్’ను కూడా ప్రధాని ప్రారంభించారు. అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల్లో భారత బ్యాంకులు, కరెన్సీని భాగం చేయాల్సిన అవసరముందని మోడీ వ్యాఖ్యానించారు. అందుకోసం ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక, కార్పొరేట్ పాలనా పద్ధతుల్ని అనుసరించాలని ఆయన సూచించారు. గత 8 ఏళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణల్ని అమలు చేశామని, డిజిటల్ పేమెంట్స్కు రోజురోజుకూ బాగా ఆదరణ పెరుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ అనేక ఆర్థిక పరిష్కార వేదికల్ని ఆవిష్కరించిందని, వాటి వినియోగాన్ని పెంచడం కోసం అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహించాలని ఆయన సూచించారు.
ఇదే సమయంలో ‘జన్ సమర్థ్’ విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు, చిన్న తరహా వ్యాపారులకు రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు తోడ్పడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వారి జీవితాలను మెరుగుపర్చడంతో పాటు తమ లక్ష్యాలను సాధించుకోవడంలో ఇది తోడ్పడుతుందన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments