PM Narendra Modi:సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్‌‌ను ప్రారంభించిన మోడీ.. కేసీఆర్ ఫ్యామిలీపై విమర్శలు

  • IndiaGlitz, [Saturday,April 08 2023]

సికింద్రాబాద్ - తిరుపతి మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ పచ్చజెండా ఊపి వందే భారత్‌ను ప్రారంభించారు మోడీ.

ప్రతికూల పరిస్ధితుల్లోనూ అభివృద్ధి దిశగా భారత్ :

ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. కరోనా , ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచంలో ప్రతికూల పరిస్ధితులు నెలకొన్నాయన్నారు. అయినప్పటికీ భారతదేశం మాత్రం ప్రగతి పథాన పయనిస్తోందని..ఈ ఏడాది బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించామని మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో రూ.35 వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని ప్రధాని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో భారత్ రూపు రేఖలు సమూలంగా మార్చామని నరేంద్ర మోడీ వెల్లడించారు.

కుటుంబపాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాం :

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సేవలు విస్తరిస్తున్నామని.. ఒకేరోజు 13 ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రధాని పేర్కొన్నారు. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్ పనులు పూర్తి చేశామని.. హైదరాబాద్-బెంగళూరు మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని మోడీ చెప్పారు. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మండిపడ్డారు. రాష్ట్రం బాగుపడుతుంటే కొందరు బాధపడుతున్నారని చురకలంటించారు. ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని తెలిపారు. నిజాయితీతో పనిచేసేవారంటే అవినీతిపరులకు భయమని.. అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రంతో కలిసి రాష్ట్రం కలిసి రావడం లేదని మోడీ పేర్కొన్నారు. కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని ప్రధాని స్పష్టం చేశారు.

More News

Malls and Shop:తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై 24 గంటలూ షాపులు, మాల్స్‌ ఓపెన్

సాధారణంగా ఎక్కడైనా దుకాణాలు ఉదయం 10 గంటలకు తెరచుకుని రాత్రి 10 .. కొన్ని చోట్ల 11 గంటల వరకు అందుబాటులో వుంటాయి.

అవి కమ్మ నందులు.. ఏ కాంపౌండ్‌కి ఎన్నో ముందే డిసైడ్, డామినేషన్ ఎవరిదంటే : పోసాని సంచలన వ్యాఖ్యలు

పోసాని కృష్ణ మురళీ.. టాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్. మనసులో ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నది వున్నట్లు కుండబద్ధలు కొడుతుంటారు.

పులే రెండడుగులు వెనక్కి వేస్తే.. అక్కడికి పుష్పా వచ్చాడని: బన్నీ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కి విందు భోజనమే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప 2’’ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేల ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా.. 6 వేలకు పైగా కొత్త కేసులు, ఏడాది తర్వాత ఇదే తొలిసారి

శాంతించింది అనుకున్న కరోనా వైరస్ భారత్‌లో మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. జాగ్రత్త పడకుంటే మరోసారి దేశంలో శవాల కుప్పలు, నిర్విరామంగా

Kiran Kumar Reddy: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి,