Modi:అన్ని వైపులా విమర్శలు.. ఊహించని ఉపశమనం, ‘‘ ది కేరళ స్టోరీ’’కి ప్రధాని నరేంద్ర మోడీ మద్ధతు
Send us your feedback to audioarticles@vaarta.com
ది కేరళ స్టోరీ చిత్రం ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కేరళకు చెందిన యువతుల మార్పిడి, మత మార్పిడిలు, ఇతర అంశాలపై తీసిన ఈ సినిమాపై ఓ వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఏకంగా కేరళ ప్రభుత్వం కూడా ఈ సినిమాను తీవ్రంగా తప్పుబడుతోంది. అంతేకాదు.. ఈ సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఊహించని మద్ధతు లభించింది. ఓ వ్యక్తి ఈ సినిమాను వెనకేసుకొచ్చారు. ఆయన ఎవరో కాదు.. ప్రధాని నరేంద్ర మోడీ.
ఉగ్రవాద శక్తుల గురించి బహిర్గతం చేశారు :
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బళ్లారిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ది కేరళ స్టోరీ చిత్రంపై ఆయన స్పందించారు. ఈ సినిమాపై కొద్దిరోజులుగా పెద్ద చర్చ జరుగుతోందని.. కేరళలో వున్న ఉగ్రశక్తుల గురించి ఈ సినిమాలో వెల్లడించారని మోడీ అన్నారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాద శక్తులకు మద్ధతుగా నిలుస్తోందని.. అలాంటి పార్టీ పట్ల కర్ణాటక ప్రజలు అప్రమత్తంగా వుండాలని మోడీ సూచించారు.
మోడీ మద్ధతు.. వాట్ నెక్ట్స్ :
అంతకుముందు ది కేరళ స్టోరీ సినిమాపై జరుగుతున్న వివాదంపై దర్శక నిర్మాతలు స్పందించారు. వాస్తవ ఘటనల ఆధారంగానే కేరళ స్టోరీ సినిమాను నిర్మించామని తెలిపారు. అటు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న హీరోయిన్ అదా శర్మ అయితే.. తనకు వందలకొద్దీ బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని చెప్పింది. అంతేకాదూ షూటింగ్ సమయంలో కొందరు తమపై దాడి చేశారని దర్శకుడు పేర్కొన్నాడు. ఇలా అన్ని వైపు నుంచి విమర్శలు వస్తున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోడీ కేరళ స్టోరీకి మద్ధతు పలకడం ఆ చిత్ర యూనిట్‌కు ఊరట కలిగించే విషయమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout