NaatuNaatuOscar:నాటు నాటుకు ఆస్కార్.. ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు మోడీ, కేసీఆర్, చంద్రబాబు, జగన్ అభినందనలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ రావడం పట్ల యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ పులకించిపోతోంది. ఎన్నో ఏళ్లు కలగా మిగిలిపోయిన ఆస్కార్ ఇప్పుడు కోరి మనల్ని వరించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ‘అప్లాజ్’ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), ‘లిఫ్ట్ మి అప్’ (బ్లాక్ పాంథర్: వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘హోల్డ్ మై హ్యాండ్’ (టాప్‌గన్ మావెరిక్) పాటలను వెనక్కి నెట్టి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ను దక్కించుకుంది. దీంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ పులకించిపోయింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ను దక్కించుకుందని తెలియగానే పలువురు సినీ ప్రముఖులు ఆ చిత్ర బృందానికి విషెస్ తెలియజేస్తున్నారు.
నరేంద్ర మోడీ :
నాటు నాటు పాట పాపులారిటీ విశ్వవ్యాప్తమైంది. చరిత్రలో మరుపురాని పాటగా నిలిచిపోతుంది. కొన్నేళ్ల పాటు ఈ పాటను గుర్తుంచుకుంటారని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లతో పాటు మొత్తం చిత్ర యూనిట్‌కు మోడీ ఆకాంక్షించారు. ఆర్ఆర్ఆర్‌తో పాటు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు అందుకున్న ఎలిఫెంట్ విస్పరర్స్ యూనిట్‌కు కూడా ప్రధాని అభినందనలు తెలిపారు.
కేసీఆర్ :
ప్రపంచ సినీ వేదికపై నాటు నాటు తెలుగు సినిమా సత్తాను చాటిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్‌ను గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణమని ముఖ్యమంత్రి కొనియాడారు. నాటు పాటు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిందని.. అలాగే తెలుగులోకి మట్టి వాసనలను చంద్రబోస్ మరింత వెలుగులోకి తెచ్చారని చంద్రశేఖర్ రావు ప్రశంసించారు.
వైఎస్ జగన్ :
ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు పాటకు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు రావడం గర్వంగా వుందని.. తనతో పాటు కోట్లాది మంది భారతీయులను గర్వపడేలా చేసినందుకు జగన్ ధన్యవాదాలు తెలిపారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్, కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లతో పాటు మొత్తం చిత్ర యూనిట్‌ను ఆయన అభినందించారు.
చంద్రబాబు నాయుడు :
ఆస్కార్ అవార్డ్‌ను దక్కించుకోవడం ద్వారా నాటు నాటు సాంగ్ చరిత్రలో నిలిచిపోయిందన్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇది భారతీయ సినిమాకు అత్యుత్తమ క్షణమని.. తెలుగువారు ఈ ఘనతను సాధించడం మరింత ప్రత్యేకమని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్, కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లతో పాటు మొత్తం చిత్ర యూనిట్‌ను ఆయన అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout