దేశ ప్రజలకు మోదీ శుభవార్త.. ఉచిత విద్యుత్ అమలుకు గ్రీన్ సిగ్నల్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల వేళ దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభవార్త అందించారు. కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana)’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో చేరేందుకు pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దేశంలో సోలార్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం ప్రవేశపెడుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
"మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రూ.75వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో.. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు. ప్రజలపై ఎలాంటి వ్యయభారం ఉండదని హామీ ఇస్తున్నాం" అని వెల్లడించారు.
క్షేత్రస్థాయిలో ఈ పథకానికి ప్రచారం తీసుకొచ్చేందుకు పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు మోదీ తెలిపారు. తమ పరిధిలో ఈ రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ప్రోత్సహించాలని సూచించారు. దీని వల్ల విద్యుత్ బిల్లులు తక్కువ రావడంతో పాటు ఉపాధి కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. గృహ వినియోగదారులతో పాటు యువత ఈ ‘సూర్య ఘర్’ పథకాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నట్లు చెప్పకొచ్చారు.
కాగా దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత పెంచి సామాన్య ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు బడ్జెట్ సందర్భంగా పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిని అమలు చేస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout