దేశ ప్రజలకు మోదీ శుభవార్త.. ఉచిత విద్యుత్ అమలుకు గ్రీన్ సిగ్నల్..

  • IndiaGlitz, [Tuesday,February 13 2024]

ఎన్నికల వేళ దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభవార్త అందించారు. కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana)’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో చేరేందుకు pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దేశంలో సోలార్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం ప్రవేశపెడుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రూ.75వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో.. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు. ప్రజలపై ఎలాంటి వ్యయభారం ఉండదని హామీ ఇస్తున్నాం అని వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో ఈ పథకానికి ప్రచారం తీసుకొచ్చేందుకు పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు మోదీ తెలిపారు. తమ పరిధిలో ఈ రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ప్రోత్సహించాలని సూచించారు. దీని వల్ల విద్యుత్‌ బిల్లులు తక్కువ రావడంతో పాటు ఉపాధి కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. గృహ వినియోగదారులతో పాటు యువత ఈ ‘సూర్య ఘర్‌’ పథకాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నట్లు చెప్పకొచ్చారు.

కాగా దేశంలో సౌర విద్యుత్‌ వినియోగాన్ని మరింత పెంచి సామాన్య ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిని అమలు చేస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.

More News

YS Sharmila: వైసీపీ నేతలకు షర్మిల సవాల్.. నా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఉందా..?

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సీఎం జగన్‌తో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆమె రచ్చబండ కార్యక్రమాల ద్వారా ఎండగడుతున్నారు.

Hyderabad: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలి.. తెరపైకి కొత్త డిమాండ్..

ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Valentines Day Special: వాలెంటైన్స్ డే స్పెషల్.. థియేటర్లలో రీరిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

ప్రతి ఏడాది ప్రేమికుల దినోత్సవంను లవర్స్ ఎంతో గ్రాండ్‌గా జరుపుకుంటారు. తమ ప్రియుడు, ప్రియురాలితో కలిసి ఆరోజు సంతోషంగా గడుపుతుంటారు. ఆ రోజును సంవత్సరమంతా

ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం..

దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చిన రైతుల మెగా మార్చ్‌ను పోలీసులు అడ్డుకుంటున్నారు. పంజాబ్, హరియాణా మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్దకు వేలాది

Pawan Kalyan: ఎన్నికల యుద్ధానికి పవన్ కల్యాణ్ సిద్ధం.. ఇక్కడి నుంచే శ్రీకారం..

ఎన్నికల కురుక్షేత్రానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఎన్నికల బరిలో దిగారు.