లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన మోదీ

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత ఏడాదిని మించి ఈ ఏడాది కేసులు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా అయితే లక్ష కేసులకు పైగా నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో మరోమారు లాక్‌డౌన్ విధిస్తారన్న చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది.

దీనిపై మోదీ నేడు ముఖ్యమంత్రుల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. దేశంలో లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితి ఓ సవాలుగా మారుతోందన్న ఆయన.. కరోనాతో పోరాటం చేసేందుకు సలహాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రులను కోరారు. అలాగే టెస్టుల సంఖ్యను పెంచాలని సూచించారు. మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌ల ఏర్పాటుపై దృష్టి సారించాలని అవసరం ఉందని మోదీ వెల్లడించారు. ఈ సెకెండ్ వేవ్‌తో మనందరం పోరాడాలన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్, పంజాబ్, వంటి పలు రాష్ట్రాల్లో మనుపటి గరిష్ఠ స్థాయిని మించి రోజువారి కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయమన్నారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకూ టీకా ఉత్సవ్‌ను నిర్వహించాలని మోదీ సూచించారు. దీనిలో భాగంగా 45 ఏళ్లు నిండిన వారంతా టీకాలు వేయించుకునేలా అవగాహన కల్పిచాలన్నారు.

ప్రజలు నిర్లక్ష్యంగా మారిపోయారన్నారు. ప్రభుత్వాల్లో కూడా అలసత్వం పెరిగిందన్నారు. కరోనాపై పోరాటం కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని మోదీ తెలిపారు. పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయాలని, ఈ క్రమంలో కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రులకు మోదీ చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి 30 మందిని ట్రేస్ చేయాలని.. కరోనా రోగుల కాంటాక్టులను 72 గంటల్లోనే గుర్తించి పరీక్షలు నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీకా వృథాను అరికట్టాలని.. జీరో వేస్టేజ్ లక్ష్యంగా ముందుకు వెళదామని మోదీ ముఖ్యమంత్రులకు సూచించారు.

More News

‘లవ్ స్టోరీ’ రిలీజ్ విషయంలో అనూహ్య నిర్ణయం..

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని గడగడలాడిస్తోంది. కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతుండటంతో ఆ ఎఫెక్ట్ సినిమాల విడుదలపై కూడా పడుతోంది.

ఒక రాత్రిలో జరిగే ఎమోషనల్‌ థ్రిల్లర్ 'లెవన్త్‌అవర్‌' : ప్రవీణ్‌ సత్తారు

చందమామ కథలు, గుంటూరు టాకీస్‌, పిఎస్‌వి గరుడవేగ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో డైరెక్టర్‌గా తనదైన మార్క్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు

ఏపీలో ‘వకీల్ సాబ్’ రిలీజ్ వివాదం స్టార్ట్

పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే టికెట్ ధరలు పెంచాలని.. రిలీజైన రెండు, మూడు వారాల్లోనే పెట్టిన పెట్టుబడి అంతా రాబట్టుకోవాలని నిర్మాతలు, పంపిణీ దారులు భావిస్తున్నారు.

‘మా’ క్రమశిక్షణా సంఘానికి చిరు రాజీనామా?

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) క్రమ శిక్షణా సంఘానికి చిరంజీవి రాజీనామా చేశారని తెలుస్తోంది.

తమిళనాడులో థియేటర్స్‌కు మళ్లీ దెబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో కూడా..

కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నది. దీంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.