కష్టకాలంలో 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించిన ప్రధాని
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా కష్టాల్లో ఉన్న భారతీయులను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ అభియాన్’ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ అందించబోతున్నట్లు తెలిపారు. ఈ ప్యాకేజీ దేశ జీడీపీలో 10శాతమని.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం అందిస్తామని భరోసానిచ్చారు. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకొని పోయేలా ఈ ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందన్నారు. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని మోదీ చెప్పారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరికీ చేయూతనిస్తుందన్నారు.
అందర్నీ కలుపుకొని పోయేలా..
‘భారత ప్రభుత్వం నుంచి వెళ్లే ప్రతి రూపాయీ శ్రామికుడు, రైతు జేబులోకి నేరుగా వెళ్తుంది. 21వ శతాబ్దపు ఆకాంక్షలకు తగ్గట్లుగా నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ ప్రత్యేక ప్యాకేజీ దోహదం చేస్తుంది. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను రేపటి నుంచి ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అందిస్తారు. ప్రతి పారిశ్రామికుల్ని కలుపుకొనిపోయేలా ప్యాకేజీ ఉంటుంది. సర్కార్ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి వెళ్తుంది. సంఘటిత, అసంఘటిత కార్మికులందర్నీ ప్యాకేజీతో ఆదుకుంటాం. విపత్తును కూడా భారత్ అవకాశంగా మల్చుకుంటుంది. ఇప్పుడు భారత్ పురోగతే ప్రపంచ పురోగతిగా మారింది’ అని జాతినుద్ధేశించి ప్రసంగంలో మోదీ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments