అష్ట దిగ్భంధనం ముగిసింది.. కరోనా కథ ముగియలేదు: మోదీ
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ మహమ్మారిని లైట్‌గా తీసుకోవద్దని భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. నేడు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో అష్ట దిగ్బంధనం ఆంక్షలు ముగిసినప్పటికీ, కరోనా వైరస్ కథ ఇంకా ముగిసిపోలేదన్నారు. ఈ సమయంలో టెస్టింగ్ ఒక్కటే అతి శక్తివంతమైన ఆయుధమన్నారు. కరోనా మహమ్మారిపై గొప్ప విజయం సాధించామని వెల్లడించారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకూ కరోనాతో మనం పోరాడుతూనే ఉండాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల కన్నా మనమే చాలా మెరుగైన స్థితిలో ఉన్నామని ప్రధాని మోదీ వెల్లడించారు.
అమెరికా, యూరోపియన్ దేశాల్లో కరోనా కేసులో మొదట్లో తగ్గినప్పటికీ, ఇప్పుడు అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమైందని తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ నిమిత్తం చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారన్నారు. జీవితాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్న.. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మోదీ సూచించారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటోందని, వ్యాక్సిన్ పరిశోధన అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉందన్నారు. కాగా మన దేశంలో కరోనా రికవరీ రేటు బాగుందని మోదీ తెలిపారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉందన్నారు.
పండుగ వేళ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. కరోనా కట్టడిలో భారత్.. అగ్రదేశాల కంటే ముందుందన్నారు. దేశంలో 90 లక్షలకు పైగా కోవిడ్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 2 వేల ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని మోదీ వెల్లడించారు.
కరోనా కేసులు తగ్గాయని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఇది పండగల సమయం.. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్ ధరించకుండా బయటికి వస్తే మీ కుటుంబాన్ని రిస్క్‌లో పెట్టినట్లేనన్నారు. కరోనాపై విజయం సాధిస్తున్నామని.. అలసత్వం పనికి రాదన్నారు. వ్యాక్సిన్ కోసం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు శ్రమిస్తున్నాయన్నారు. అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout