ప్లస్ వన్ ఆడియో విడుదల..!
Saturday, December 24, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రోషన్, ఆర్తి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ప్లస్ వన్. అళహరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుచేతా డ్రీమ్స్ వర్క్ ప్రొడక్షన్స్ పతాకం పై విశ్వాస్.హెచ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఆడియో వేడుక ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మిస్ ఏసియా, మిస్ ప్లానెట్ ఇండియా రేష్మిఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను ఆవిష్కరించి తొలి ఆడియో సీడీలను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ కు అందచేసారు.
ఈ సందర్భంగా రేష్మి ఠాకూర్ మాట్లాడుతూ.... చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. మంచి సినిమానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎంతో కష్టపడి ఈ చిత్రయూనిట్ చేసిన ప్లస్ వన్ చిత్రం విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... నైజాంలో ఈ చిత్రాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ చిత్రంలో తండ్రి పాత్రను కూడా పోషించాను. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది అనుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత ఈ టీమ్ ప్లస్ టు చిత్రం కూడా తీయాలి అన్నారు.
డైరెక్టర్ అళహరి మాట్లాడుతూ... యువత అంటే అల్లరి చిల్లరగా తిరగడే కాదు. అనుకోని సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు. ఎంత విజ్ఞత ప్రదర్శించారు అన్నదే ఈ చిత్ర కథాంశం. వినోదంతో పాటు సందేశం మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం అన్నారు.
నిర్మాత విశ్వాస్.హెచ్ మాట్లాడుతూ... ఈ నెల 30న ఈ చిత్రాన్నిరిలీజ్ చేస్తున్నాం. హీరో,హీరోయిన్లు కొత్తవారైనప్పటికీ చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. నటుడు అయిన నేను ఈ చిత్రంతో నిర్మాతగా మారాను అన్నారు.
సీనియర్ నటి పూర్ణిమ మాట్లాడుతూ... పవర్ ఫుల్ మదర్ క్యారెక్టర్ చేసాను. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు జయసూర్య, హీరో రోషన్, హీరోయిన్ ఆర్తి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జె.వి.ఆర్, బస్టాఫ్ ఫేమ్ అలేఖ్య, రావుశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments