సమంతకి మూడోసారి కూడా ప్లస్ అవుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఈ తరం కథానాయికల్లో సమంత మొదటి స్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సమ్మర్‌లో సమంత హీరోయిన్‌గా వచ్చిన మూడు సినిమాలు కూడా మంచి విజయం సాధించి ఈ విషయాన్ని మరోసారి ఫ్రూవ్ చేశాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆమె కన్నడ రీమేక్ ఫిల్మ్ ‘యూ టర్న్’లో విలేకరి పాత్రలో నటిస్తున్నారు. ఇంతకు ముందు కూడా సమంత రెండు రీమేక్ చిత్రాలను చేసి విజయాలను అందుకున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘అఆ’ (2016) సినిమా 1973 నాటి ‘మీనా’ సినిమాకి రీమేక్ కాగా.. మలయాళం సినిమా ‘ప్రేతమ్’కి రీమేక్‌గా ‘రాజు గారి గది 2’ (2017) రూపొందింది. ఇలా వరుస సంవత్సరాల్లో రీమేక్‌లుగా వచ్చిన ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందించాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం చేస్తున్న కన్నడ రీమేక్ ఫిల్మ్ ‘యూ టర్న్’ కూడా విజయం సాధిస్తుందేమో చూడాలి. కాగా.. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com