దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి: రజినీకాంత్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని రీసెంట్‌గా తెలియజేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ తెలియజేసిన కొన్ని రోజులకు ఆయన హై బీపీతో ఇబ్బంది పడ్డారు. డాక్టర్స్ సూచన మేరకు టెన్షన్స్‌కు దూరంగా ఉండాలనుకున్న తలైవా రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు తెలియజేశారు. అయితే దీనిపై రజినీకాంత్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ చెన్నైలో ఆందోళన ప్రారంభించారు. దీంతో మరోసారి రజినీకాంత్ తన రాజకీయాల్లోకి రావడంపై స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక లేఖను రాసి పోస్ట్ చేశారు. అందులో ఆయన ఏం చెప్పారంటే..
"నన్ను బతికిస్తున్న దేవుళ్లయిన అభిమానులకు, రాజకీయాల్లోకి రావడం పట్ల నా నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోవాలని కొందరు, కొందరు నా అభిమాన సంఘంలోని వ్యక్తులు చెన్నైలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.దీన్ని క్రమశిక్షణా బద్ధంగా, గౌరవప్రదంగా నిర్వహించారు. అందుకు వారికి నా కృతజ్ఞతలు. అయితే నేను అధ్యక్షకుడినయినప్పటికీ.. నా ఆదేశాలను అతిక్రమించి సమావేశాన్ని నిర్వహించడం బాధాకరం. మండ్రం నిర్వాహకుల అభ్యర్ధనను గుర్తించి, గౌరవించి ఈ కార్యక్రమంలో పాల్గొనని వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోతున్నాననే విషయాన్ని ఇదివరకే పూర్తిగా వివరించాను. నేను నా నిర్ణయాన్ని అప్పుడే ప్రకటించాను. దయచేసి ఇంకెవ్వరూ ఇలాంటి సమావేశాలను నిర్వహించి, నన్ను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించి ఇబ్బంది పెట్టవద్దు అని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను" అని తెలిపారు రజినీకాంత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments