సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు.. కోర్టుకు రావాల్సిందే!

  • IndiaGlitz, [Friday,November 01 2019]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఊహించని షాకిచ్చింది. కోర్టు విచారణకు హాజరవడంపై మినహాయింపును ఇవ్వాలంటూ ఆయన పిటిషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పిటిషన్‌ను శుక్రవారం నాడు విచారించిన కోర్టు తీర్పును వెలువరించింది. మినహాయింపు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు కోర్టు తేల్చిచెప్పింది. కోర్టు విచారణకు ప్రతి శుక్రవారం రావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. ఇందుకు కారణాలను సైతం కోర్టు నిశితంగా వివరించింది.

పరిస్థితులు మారాయని నేరంలో ఎలాంటి మార్పు లేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. వైఎస్ జగన్‌ ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేయడానికి యత్నించారని.. అలాంటిది ఇప్పుడు ఆయన సీఎం స్థానంలో ఉన్నారన్న విషయాన్ని కోర్టుకు సీబీఐ అధికారులు గుర్తు చేశారు. అధికారులంతా ముఖ్యమంత్రి మాటను వినాల్సి ఉంటుందని, ఆయనకు వ్యక్తిగత మినహాయింపును ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు... జగన్‌కు వ్యక్తిగత మినహాయింపును ఇవ్వలేమని తెలిపింది. కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని... ఒక రోజు కోర్టుకు వస్తే తన ప్రొటోకాల్, సెక్యూరిటీ కోసం రూ. 60 లక్షలు ఖర్చవుతుందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, దీంతో పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చవుతుందని పిటిషన్‌లో జగన్ పేర్కొన్న విషయం విదితమే. దీనికి తోడు, ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం ఇబ్బందని పిటిషన్‌లో తెలిపారు. అయితే ఈ క్రమంలో జగన్, ఆయన తరఫు న్యాయవాది ఏం చేయబోతున్నారనే దానిపై ఏపీ రాజకీయాల్లో, వైసీపీలో చర్చనీయాంశమవుతోంది.

More News

'నిశ్శ‌బ్దం' లో అంజ‌లి లుక్ విడుద‌ల‌

అభిన‌యంతో పాటు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ అంజ‌లి.

జొన్నవిత్తులపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

వివాదాలకు కేరాఫ్‌గా పేరుగాంచిన.. వివాదాలే ఊపిరిగా భావించే రామ్‌గోపాల్ వర్మ ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అనే మూవీతో మరో సంచలనానికి తెరలేపుతున్న విషయం విదితమే.

బిగ్‌బాస్‌‌-3: రాహుల్ కోసం రంగంలోకి దిగిన తల్లి!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌-3 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ సీజన్‌లో టైటిల్‌ ఎవరు ఎగరేసుకుపోతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

బాబు, లోకేష్, పవన్‌లకు మంత్రి అవంతి ఓపెన్ చాలెంజ్

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఓపెన్ చాలెంజ్ చేశారు.

పవన్‌ ర్యాలీకి మద్దతిచ్చిన చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత సంభవించిందని గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు హడావుడి చేసిన సంగతి తెలిసిందే.