అమ్మ పాత్రలో చేయడమే డ్రీమ్ రోల్ అంటుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ ప్రజల అమ్మగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితకు ఉన్న క్రేజే వేరు. ఉన్నట్టుండి జయ అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ కావడం, నాటకీయ పరిణామాల మధ్య జయలలిత మరణించడం జరిగింది. జయలలిత, శశికళ ప్రాణ స్నేహితులనే సంగతి అందిరికీ తెలిసిందే. జయ మరణంపై శశికళ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఇవన్నీ పక్కన పెడితే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తాను శశికళ పేరుతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అల్రెడి కన్నడలో జయలలితపై ఓ సినిమా కూడా రూపొందుతోంది. జయ మరణం తర్వాత కొంత రీషూట్ కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జయలలిత బయోపిక్‌లో రమ్యకృష్ణ నటిస్తే బావుంటుందని ఓ ఫ్యాన్..మదర్ అనే పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేయడం పెద్ద వార్తైంది. ఈ సందర్భంలో రమ్యకృష్ణ ఈ విషయంపై నోరు విప్పింది. ఇప్పటి వరకు తనకు ఏ డ్రీమ్ రోల్ లేదని, అయితే జయలలిత పాత్రలో నటించడమే తన డ్రీమ్రోలని, ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో వస్తే తాను నటించడానికి సిద్ధమేనని కూడా రమ్యకృష్ణ పెర్కొనడం విశేషం. మరో విషయమేమంటే హీరోయిన్ త్రిష కూడా జయలలిత పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతుంది. ఒకవేళ నిజంగానే ఎవరైనా జయలలిత స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తే రమ్యకృష్ణ, త్రిషల్లో జయలలితగా ఎవరు నటిస్తారో చూడాలి....
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com