బతికుంటే గెలుస్తూనే ఉంటా.. చచ్చిపోతా: పేకాట ‘కింగ్’
- IndiaGlitz, [Tuesday,October 29 2019]
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన బావాజీ అనే ప్లేయింగ్ కార్డ్స్‌లో కింగ్.. కంటిచూపుతోనే లాఘవం ప్రదర్శిస్తున్నాడు. జూదంలో లోపల, బయట(in and out)లో ఆయన స్టైల్లో ప్రతిభ చూపుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ ఈ కుర్రాడు ఓడిన సందర్భాలు అస్సలు లేవట. ఆరో తరగతి వరకూ చదువుకున్న ఈ కుర్రాడు పేకాటలో కింగ్‌లా మారి చాలా మందిని ఓడించాడు. అయితే ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంటున్నాడు. అదేమిటంటే తాను జీవితంలో చేసిందేమీ లేదని.. తాను బతికుంటే ఇంకా గెలుస్తూనే ఉంటానని అందుకే ఇక తనకు ఈ జీవితం వద్దని అవయాలు దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సబ్ కలెక్టర్ కీర్తికి అర్జీ అందజేశాడు.
ఇదీ అసలు కథ.. ఆసక్తికర విషయాలు..!
‘నాకు బతకాలని లేదు. బతికిన జీవితంలో గెలుస్తూనే ఉంటాను. దీనివలన చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. నేను జీవితంలో సంపాదించిన డబ్బు అంతే.. గెలుచుకున్న డబ్బులు నాకు వద్దు. చదువు సంధ్యా లేని నేను వేరే ఏ పని చేయలేను. నా వల్ల ఓడిపోయిన కుటుంబాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఇలా మారాలనుకుంటున్నాను. ఏ పనీ చేయలేని నేను ఈ సమాజానికి ఏదైనా కొంచెం చేయాలని నా అవయవాలు దానం చేయాలని వచ్చాను’ అని సబ్ కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు. బావాజీ మాటలకు.. ఫిర్యాదు చూసిన సబ్ కలెక్టర్ విస్తుపోయి తెలివిగల యువకులు విపరీత ధోరణితో ఆలోచించకూడదని, మంచిగా చదువుకుంటే ప్రభుత్వం నుంచి సహాయం చేస్తామని అభయమిచ్చారు.