దసరా కానుకగా ఈ నెల 22న రాబోతున్న 'ప్లేయర్'
Send us your feedback to audioarticles@vaarta.com
ట్రిపుల్ ఎక్స్ సోప్ యాడ్ తో నటుడిగా పరిచయం అయిన పర్వీన్ రాజ్ ఇప్పుడు హీరోగా మారాడు. అతను కథానాయకుడిగా డ్రీమ్ మర్చంట్స్ బ్యానర్ పై యమున కిశోర్, జగదీశ్ కుమార్ కాళ్ళూరి 'ప్లేయర్' సినిమా నిర్మించారు. జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన పలు ప్రతిష్ఠాత్మకమైన కంపెనీల యాడ్స్ ను రూపొందించిన ఈ సంస్థ 'ప్లేయర్' మూవీతో చిత్ర నిర్మాణ రంగంలోకీ అడుగుపెట్టింది.
కథానుగుణంగా 'ప్లేయర్' సినిమాను బ్యాంకాక్ లో చిత్రీకరించారు. తెలుగులో ఇటువంటి కథ ఇంతవరకూ రాలేదని, ఈ తరాన్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రం అనేకం ఉన్నాయని నిర్మాతలు తెలిపారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలనూ జరుపుకున్న ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. కథానాయకుడిగా ఇది పర్వీన్ రాజ్ కు తొలి చిత్రమే అయినా సీనియర్ నటులు నాగినీడు, సీతతో పోటీ పడి నటించాడని, నటుడిగా అతనికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందని వారు తెలిపారు. 'ప్లేయర్' చిత్రం ద్వారా జ్ఞానసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
అలానే దాదాపు 150 వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చిన రజీష్ రఘునాథ్ ఈ చిత్రానికి నేపథ్యం సంగీతం అందించారు. కథానుగుణంగానే ఇందులో పాటలకు చోటు కల్పించలేదని, రీ-రికార్డింగ్ సినిమా స్థాయిని ఎంతో పెంచిందని నిర్మాతలు చెప్పారు. బ్యాంకాక్ అందాలను సినిమాటోగ్రాఫర్ ఎస్. సురేశ్ అత్యద్భుతంగా తెరకెక్కించారని... ఈ మూవీని విజువల్ ఫీస్ట్ గా మార్చారని తెలిపారు. దసరా కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ప్లేయర్'కు చక్కని ఆదరణ అభిస్తుందనే విశ్వాసాన్ని నిర్మాతలు యమున కిశోర్, జగదీశ్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com