జబర్థస్త్ స్టార్స్ తో సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
ధనరాజ్-వేణు-తాగుబోతు రమేష్-చమ్మక్‌చంద్ర.. ఈ నలుగురు ఇటు వెండితెరపై వెలుగులు విరజిమ్ముతూనే.. అటు బుల్లితెరపై చెలరేగిపోతున్నారు. జబర్ధస్త్ తో బాగా పాపులర్ అయిన ధనరాజ్-వేణు-తాగుబోతు రమేష్-చమ్మక్‌చంద్ర.. ప్రధాన పాత్రధారులుగా ఓ హాస్య చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు రాజశేఖర్‌రెడ్డి అనే ఓ యువ వ్యాపారవేత్త. ఓ ప్రముఖ రచయిత అందించిన కథతో రూపొందనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది.
ఈ సందర్భంగా...
ధనరాజ్ మాట్లాడుతూ.. నేను, వేణు, రమేష్, చంద్ర.. నలుగురం ఈ కథ వింటున్నంత సేపూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉన్నాం. నిజ జీవితంలో మంచి స్నేహితులమైన మేం నలుగురం ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తుండడం చాలా సంతోషంగానూ, ఎగ్జయిటింగ్‌గానూ ఉంది. ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలోనే వెల్లడించనున్నాం అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments