పాక్‌లో ఘోర విమాన ప్రమాదం.. 98 మంది మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలో జనావాసాల మధ్య కూలిన ఒక్కసారిగా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 90 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది మృతి చెందారు. శుక్రవారం 4 గంటల ప్రాంతంలో లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న ఏ-320 విమానం కుప్పకూలిపోయింది. కరాచీ విమానాశ్రయానికి అతి సమీపంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ల్యాండింగ్‌కు ఒక్క నిమిషం ముందు ఈ విమానం కుప్పకూలింది. విమానం కూలిన ధాటికి చుట్టుపక్కలున్న 10 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ప్రమాదంలో 110 మంది మృతిచెందినట్లు సమాచారం. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ శబ్దంతో పాటు పెద్ద ఎత్తున పొగ రావడంతో జనం పరుగులు తీశారు. ఘటనాస్థలిలో జనాలు హాహాకారాలతో విషాద ఛాయలు అలుమున్నాయి. అయితే ఈ ఘటనలో చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. అంతేకాదు.. అసలు ఎంత మంది చనిపోయారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout