కోట్లిస్తానన్నా బాబుకు ‘పీకే’ షాక్.. జగన్‌కే ‘జై’!!
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబుకు ‘పీకే’ మరోసారి షాకిచ్చారా..? కుదరదంటే కుదరదు.. అస్సలు కుదరదని తేల్చిచెప్పేశారా..? ఇక ముందు మీరు పదే పదే ఇలా అడగమాకండి.. అని పీకే తేల్చిచెప్పేశారా..? అంటే తాజా పరిణామాలు, లీకులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమని తెలుస్తోంది.
కర్త, కర్మ, క్రియ ఎవరంటే!
2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ కనివినీ ఎరుగని రీతిలో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది. 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీని వైసీపీ మట్టికరిపించింది. ఏ రేంజ్‌లో అంటే ‘సైకిల్’ ఇక రెండు మూడు టెర్మ్‌లలో రిపేర్ చేయించినా బహుశా కాదు.. కాలేదేమో. ఆ పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ఈ స్థాయిలో సీట్లు దక్కించుకోవడానికి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కర్త, కర్మ, క్రియ ఎవరంటే టక్కున గుర్గొచ్చేది రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్.. సింపుల్‌గా అయితే ‘పీకే’.
కుదరదంటే కుదరదు!
ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కష్టం, శ్రమకు.. పీకే సలహాలు, సూచనలు తోడవ్వడంతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపెన్నడూ లేని ఘన విజయాన్ని వైసీపీ సొంతం చేసుకోగా.. టీడీపీ దాదాపు భూస్థాపితమైపోయింది.! దీంతో 2024లో ఎన్నికలకు తమ పార్టీకోసం పనిచేయాలని.. 2019 ఫలితాల అనంతరం ఒకట్రెండు సార్లు చంద్రబాబు.. పీకేను సంప్రదించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై బాబుగానీ.. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు గానీ ఖండించిన దాఖలాల్లేవ్. అయితే తాజాగా మరోసారి చంద్రబాబు సంప్రదించగా.. ‘కుదరదంటే కుదరదని.. మీరు ఇలా పదే పదే అడగమాకండి’ అని తేల్చిచెప్పేశారని టాక్ నడుస్తోంది.
జగన్‌కు ‘జై’.. బాబుకు ‘నో’!
అంతేకాదు.. వైసీపీ ఇచ్చిన కోట్ల డబ్బుకంటే ఇంకా ఎక్కువగా ఇస్తామని చెప్పినప్పటికి అస్సలు కుదరదని తేల్చిచెప్పేశాడట. ఇందుకు కారణం.. 2024లో కూడా వైసీపీకే పనిచేస్తానని ఇదివరకే ఒప్పందం కుదుర్చుకున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే జగన్‌కు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్లీ.. మరో పార్టీకి మాటివ్వడం సబబు కాదని భావించిన పీకే.. జగన్‌కు జై కొట్టి.. టీడీపీకి మరోసారి షాకిచ్చారు. అంటే.. పీకే, ఆయన ఐపాక్ టీమ్ మరోసారి జగన్ కోసం పనిచేయనున్నారన్న మాట. మరి 2019 వరకు ఓకే.. 2024లో ప్లాన్ ఎలా వర్కవుట్ అవుద్దో..? చంద్రబాబు ఏం చేయబోతున్నారో..? పీకే వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో..? తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments