18న పీకే సంచలన ప్రకటన!?
- IndiaGlitz, [Thursday,February 13 2020]
అవును మీరు వింటున్నది నిజమే.. ఈ నెల 18న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే సంచలన ప్రకటన చేయబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఓ ఇంటర్వ్యూ వేదికగా ప్రకటించాడు..? ఇంతకీ ఆ ప్రకటన ఏమై ఉంటుంది..? పీకే మనసులో ఏముంది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త పీకే గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈయన ఏ పార్టీతో జట్టుకట్టినా విజయం వారిదే విజయం. ఇప్పటికే పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన.. గ్రాండ్ సక్సెస్ అయ్యారు. తాజాగా.. ఆమ్ ఆద్మీ పార్టీని కూడా గెలిపించి.. కేజ్రీవాల్‌ను మరోసారి సీఎం పీఠమెక్కించారు. ఆయన గీసే రాజకీయ వ్యూహాలు.. ఆయన ఎత్తులు.. పై ఎత్తులు అలా ఉంటాయ్ మరి. అయితే ఇలా పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ఆయన.. ఆ మధ్య జేడీయూలో చేరి పార్టీ ఉపాధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. అయితే ఆయన మాత్రం బీజేపీ-జేడీయూ మిత్రపక్ష పార్టీలు అనేది మరిచిన ఆయన.. బీజేపీపై ఇష్టారీత్యా మాట్లాడుతున్నారని పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేసిన విషయం విదితమే.
ఏం చేయబోతున్నాడు!?
ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం.. ఈ విషయాల గురించి మాట్లాడతానని పీకే గతంలో ఓ ప్రకటన చేశారు. అయితే ఫిబ్రవరి 11న ఢిల్లీ ఫలితాలు వచ్చినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. అయితేతాజాగా నెటిజన్ల్ ఢిల్లీలో ఆప్ గెలవడంతో ఆయన ఇంతకీ ఏం ప్రకటన చేయబోతున్నారు..? ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు..? కొత్త పార్టీ పెడతారా లేకుంటే మిన్నకుండిపోతారా? అనేది మాత్రం తెలియరాలేదు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు.
సర్వత్రా ఉత్కంఠ!
రిజల్ట్స్ వచ్చినప్పటికీ.. బిహార్ రాజకీయాల గురించి ఆయన ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. దీంతో రాజకీయ భవిష్యత్తు గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన పీకే.. ఈ నె ల 11న చెప్పాల్సిన ఆ విషయం 18న చెప్పుబోతున్నానని ప్రకటించారు. అయితే ఆయన ఏం చెప్పబోతున్నారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆరోజు పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి వ్యూహకర్త ఏం చేయబోతున్నాడో.. ఏం ప్రకటించబోతున్నాడో తెలియాలంటే మరో నాలుగురోజులు వేచి చూడక తప్పదు మరి.!