'పీకే' అంటే పవన్ కల్యాణ్.. మరి పాక్‌‌లో..!

  • IndiaGlitz, [Saturday,March 02 2019]

పీకే అంటే మన దేశంలో టక్కున గుర్తొచ్చే పేర్లు రెండే.. టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రముఖ ప్రచారకర్త ప్రశాంత్ కిశోర్. ఈ ఇద్దరి ‘పీకే’స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పుల్వామా ఘటన జరిగిన నాటి నుంచి పవన్ కల్యాణ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో, జాతీయ-అంతర్జాతీయ మీడియాల్లోనూ చర్చలు జరిగాయి.. ఎన్నో వెబ్‌సైట్స్ కథనాలు కూడా రాశాయి. ఈ వార్తలు విన్న పవన్ కల్యాణ్ ఒకింత షాక్ అయ్యారట. అసలేం జరుగుతోంది..? ఏంటి పరిస్థితి అని..? అయితే ఆ వ్యవహారం ఏంటో చూద్దాం.

పాక్‌లో పీకే అంటే ఇదీ అర్థం..

మన దేశంలో ఎక్కువగా పీకే అంటే ఆ ఇద్దరి పేర్లే గుర్తొస్తాయన్నది జగమెరిగిన సత్యమే.. మరి పాక్‌‌లో ఏమంటారు..? అనే విషయాలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహన్ నిశితంగా వివరించారు. ‘పీకే’ అనగానే మనమంతా పవన్ కల్యాణ్ అని అనుకుంటున్నాం. కానీ పాకిస్థాన్‌లో మాత్రం ఆయన ‘మన మనిషే’ అని ప్రజలు అనుకుంటున్నారు. అంతర్జాతీయ కోడ్‌లో పాకిస్థాన్‌ను సంక్షిప్తంగా పీకే అని పిలుస్తారు అని జీవీఎల్ చెప్పుకొచ్చారు. యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే తనకు తెలుసన్న పవన్ మాటలను పాక్ మీడియా ప్రముఖంగా ప్రచురించిందన్నారు. చినబాబు, పెదబాబుపై గతంలో విమర్శలు గుప్పించిన పవన్, ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారని ఈ సందర్భంగా జనసేనానిని జీవీఎల్ ప్రశ్నించారు.

కాగా.. శుక్రవారం రోజున ప్రధాని నరేంద్ర మోదీ.. విశాఖ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటనపై శివాజీ మొదలుకుని తెలుగు తమ్ముళ్లు, సీఎం చంద్రబాబు కూడా తివ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా మోదీ పర్యటన, చంద్రబాబు రియాక్షన్‌‌పై జీవీఎల్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూటర్న్‌లు తీసుకోవడంలో చంద్రబాబు చాలా అసాధ్యుడన్నారు. గతంలో మాట్లాడిన తప్పుడు మాటలను చంద్రబాబు పునరావృతం చేయరన్న గ్యారెంటీ ఏమీ లేదని స్పష్టం చేశారు.

చంద్రబాబుతో పాటు పవన్ కూడా..

చంద్రబాబుకు తోడుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పెద్దహీరో పవన్ కల్యాణ్ తో ఆ తరహా వ్యాఖ్యలు చేయించారేమో. లేక పీకే అనే పదం ఉంది కాబట్టి పవన్ కల్యాణే సొంతంగా ప్రభావితమయ్యారేమో. ఈ విషయంలో పవన్ కల్యాణే ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. కాగా తనను విమర్శిస్తే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే పవన్.. జీవీఎల్, చంద్రబాబు వ్యాఖ్యలపై ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

యండమూరి "దుప్పట్లో మిన్నాగు" టీజర్ విడుదల

యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతొన్న చిత్రం "దుప్పట్లో మిన్నాగు". చిరంజీవి క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి అమర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‌ ‌

బ్లాక్ అండ్ వైట్ సినిమాలో న‌య‌న‌తార‌

న‌య‌న‌తార ఇప్పుడు కేవ‌లం ఓ హీరోయిన్ మాత్ర‌మే కాదు. లేడీ సూప‌ర్‌స్టార్‌. కేవ‌లం ఆమె పాత్ర‌ల కోసం థియేట‌ర్ల‌కు జ‌నం క్యూ క‌డుతున్నారంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు.

'ప్రేమాలయం' ఆడియో విడుదల

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సిద్ధార్థ తమిళంలో

బిగ్ బి ర్యాప్‌

సంగీతం అంటే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్‌కు చాలా ఇష్టం. ఈ సీనియ‌ర్ స్టార్ హీరో ఇంట్లో మ్యూజిక్ స్టూడియో కూడా ఉంది.

గంట‌న్న‌ర‌లో మూడు కోట్లు

గంట‌న్నర‌కు మూడు కోట్ల రూపాయ‌లు అంటే ఎవ‌రికో మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇస్తున్న రెమ్యున‌రేష‌న్ మాత్రం కాదు.