'అష్టాచమ్మా' కంటే 'పిట్టగోడ' పెద్ద హిట్ కావాలి - మోహనకృష్ణ ఇంద్రగంటి
- IndiaGlitz, [Friday,December 09 2016]
'అష్టాచమ్మా', 'గోల్కొండ హైస్కూల్', 'ఉయ్యాలా జంపాలా' వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ రామ్మోహన్ పి. తాజాగా ఆయన నిర్మిస్తున్న క్రేజీ చిత్రం 'పిట్టగోడ'. స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, సన్‌షైన్ సినిమాస్ పతాకాలపై అనుదీప్ కె.వి.ని దర్శకుడిగా పరిచయం చేస్తూ దినేష్‌కుమార్, రామ్మోహన్ పి. నిర్మిస్తున్న 'పిట్టగోడ' చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అతి త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతుంది. కాగా ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రంలోని ఒక్కొక్క సాంగ్‌ను డిఫరెంట్‌గా రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 6న మొదటి పాటను, డిసెంబర్ 7న రెండో పాటను విడుదల చేశారు. మూడో పాట 'తియ్య తియ్యని' పాటను డిసెంబర్ 9న రేడియో సిటీలో ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విశ్వదేవ్, పునర్వి, దర్శకుడు అనుదీప్ కె.వి., నటులు రాము, రాజు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ - ''పిట్టగోడ'లోని 'తియ తియ్యని' మూడో పాట లాంచ్ చేయడం చాలా హ్యాపీగా వుంది. రామ్మోహన్ నాకు మధ్య అనుబంధం చాలా గాఢమైంది. 'మాయాబజార్' తర్వాత రామ్మోహన్, నేను ఓ సినిమా చెయ్యాలనుకున్నాం. నేను ఎంతో ఇష్టపడి ప్రేమించి తీసిన 'అష్టాచమ్మా', 'గోల్కొండ హైస్కూల్' చిత్రాలు పెద్ద హిట్ అయ్యాయి. ఎంతో టేస్ట్ వున్న నిర్మాత. కొత్తవారిని స్టార్స్‌గా తయారు చేయగల గట్స్ వున్న నిర్మాత. ఇప్పుడు అంతా కొత్తవారితో 'పిట్టగోడ' కోసం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ చాలా బాగుంది. క్యాచీగా వుంది. అందమైన తెలుగు టైటిల్స్‌తో సినిమాలు తీస్తున్నారు రామ్మోహన్. టీజర్‌కి, పాటలకీ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. కమలాకర్ మంచి మ్యూజిక్ అందించారు. 'పిట్టగోడ' అనేది మంచి జ్ఞాపకం. ఈ సినిమా 'అష్టాచమ్మా'ను మించి పెద్ద హిట్ అవ్వాలని యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ - ''కథ నాకు బాగా నచ్చింది. ఛాలెంజింగ్‌గా అన్పించింది. కమలాకర్ మంచి ట్యూన్స్ అందించారు. 'తియ తియ్యని' శాడ్ సాంగ్ రిలీజ్ చేశాం. పాటలకి మంచి అప్లాజ్ వస్తుంది'' అన్నారు.
హీరోయిన్ పునర్వి మాట్లాడుతూ - ''చాలా ఎగ్జైటింగ్‌గా వుంది. సబ్జెక్ట్ చాలా ఇంప్రెసివ్‌గా వుంది. ఈ చిత్రంలో అన్ని పాటలు చాలా బాగున్నాయి. సినిమా మంచి హిట్ అవుతుంది'' అన్నారు.
దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ - ''ఉయ్యాలా జంపాలా' చిత్రానికి వర్క్ చేసాను. మా టౌన్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని కథ రెడీ చేశాను. సురేష్‌బాబుగారు, రామ్మోహన్‌గారు స్క్రిప్ట్ విని బాగా ఎగ్జైట్ అయ్యారు. అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఒక నలుగురు కుర్రాళ్ల మధ్య జరిగే కథ ఇది. సినిమా చూస్తున్నంతసేపూ ప్రతి ఒక్కరికీ వారి చిన్న నాటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఈ సినిమా సక్సెస్ అయ్యి మా అందరికీ మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.