21న ప్రేక్షకుల ముందుకొస్తున్న 'పిశాచి-2'

  • IndiaGlitz, [Wednesday,April 19 2017]

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2ష‌. 'డేంజర్ జోన్' అన్నది ట్యాగ్ లైన్. నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి.. లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ సహ నిర్మాతలు. ఏప్రిల్ 21న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సాయి వెంక‌ట్ మాట్లాడుతూ, ' క‌న్న‌డ భాష‌లో పెద్ద విజ‌యం సాధించిన చిత్ర‌మిది. ఏ సినిమాలో నైనా విష‌యం ఉంటే హిట్ అవుతుంది. ఈసినిమా కూడా ఆ కోవ‌కు చెందించే. పిశాచి వ‌ల్ల ఓ గ్రామ ప్ర‌జ‌లు ఎదుర్కున్న ఇబ్బందులేంటి? వాటి నుంచి ఆ దుర్గామాత ఎలా బ‌య‌ట పడేసింది అన్న‌దే క‌థ‌. ప్ర‌తీ స‌న్నివేశం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. 100 థియేట‌ర్ల‌లలో సినిమా విడుద‌ల చేస్తాం. తెలుగు ప్రేక్ష‌కులంతా సినిమా ను ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా' అని అన్నారు.
నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ' బాహుబ‌లి-2 సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందే పిశాచి ప్రేక్ష‌కుల ముందుకు ఓ పెద్ద సినిమాలా వ‌స్తుంది. ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నా' అని అన్నారు. చిత్ర హీరోయిన్ శిప్రా గౌర్ మాట్లాడుతూ... తెలుగులో టెన్తులో మూవీ చేశాను. తర్వాత హిందీలో ఒకటి, తమిళంలో రెండు, కన్నడలో రెండు సినిమాలు చేశాను. తెలుగులో పిశాచి 2 గా రిలీస్ అవుతున్న చిత్రం కన్నడలో 150 రోజులు ఆడి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.తెలుగులో కూడా విజయవంతమౌతుందని టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా అన్నారు.
ఈ స‌మావేశంలో సుప్రీక‌ర్, నాగేశ్వ‌ర‌రావు, ముర‌ళీకృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు

More News

నా కెరీర్ మొత్తంలో నేను నటించిన డిఫరెంట్ సినిమా 'లంక'

సీనియర్ కథానాయిక రాశి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `లంక`. రోలింగ్రాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నామన దినేష్, నామన విష్ణు కుమార్ నిర్మిస్తున్నారు.

'కొత్త కుర్రోడు' పాటలు మినహా షూటింగ్ పూర్తి

లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా `కొత్త కుర్రోడు`. లక్ష్మణ్ పదిలం నిర్మాత. మోహన్రావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ్-శ్రీప్రియ, మహేంద్ర-ఆశ జంటలుగా నటిస్తున్నారు.

'ఉగ్రం' పోస్టర్ విడుదల

నక్షత్ర మీడియా పతాకంపై జెడి చక్రవర్తి,అక్షిత జంటగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో

అమెరికాలో నాన్ స్టాప్ గా 14 రీల్స్ భారీ చిత్రం 'లై' షూటింగ్

యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.

రైటర్ తో దిల్ రాజు ఏం చేస్తాడు...

కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయడంలో ముందుండే నిర్మాత దిల్రాజు,తన ప్రయత్నంలో ఎన్నో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు.