21న ప్రేక్షకుల ముందుకొస్తున్న 'పిశాచి-2'
Wednesday, April 19, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2ష. `డేంజర్ జోన్` అన్నది ట్యాగ్ లైన్. నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి.. లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ సహ నిర్మాతలు. ఏప్రిల్ 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాయి వెంకట్ మాట్లాడుతూ, ` కన్నడ భాషలో పెద్ద విజయం సాధించిన చిత్రమిది. ఏ సినిమాలో నైనా విషయం ఉంటే హిట్ అవుతుంది. ఈసినిమా కూడా ఆ కోవకు చెందించే. పిశాచి వల్ల ఓ గ్రామ ప్రజలు ఎదుర్కున్న ఇబ్బందులేంటి? వాటి నుంచి ఆ దుర్గామాత ఎలా బయట పడేసింది అన్నదే కథ. ప్రతీ సన్నివేశం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. 100 థియేటర్లలలో సినిమా విడుదల చేస్తాం. తెలుగు ప్రేక్షకులంతా సినిమా ను ఆదరిస్తారని ఆశిస్తున్నా` అని అన్నారు.
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, ` బాహుబలి-2 సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందే పిశాచి ప్రేక్షకుల ముందుకు ఓ పెద్ద సినిమాలా వస్తుంది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా` అని అన్నారు. చిత్ర హీరోయిన్ శిప్రా గౌర్ మాట్లాడుతూ... తెలుగులో టెన్తులో మూవీ చేశాను. తర్వాత హిందీలో ఒకటి, తమిళంలో రెండు, కన్నడలో రెండు సినిమాలు చేశాను. తెలుగులో పిశాచి 2 గా రిలీస్ అవుతున్న చిత్రం కన్నడలో 150 రోజులు ఆడి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.తెలుగులో కూడా విజయవంతమౌతుందని టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా అన్నారు.
ఈ సమావేశంలో సుప్రీకర్, నాగేశ్వరరావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments