‘పింక్ వాట్సాప్’తో జాగ్రత్త..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇంటర్నెట్ బాగా డెవలప్ అయ్యాక.. ప్రజానీకానికి పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాక ఏం చేయాలన్నా ఒక్క క్షణం ఆలోచించి చేయాల్సిందే. ఎందుకంటే ఎంతలా అయితే ఇంటర్నెట్ వృద్ధి చెందిందో అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు కూడా తెలివిమీరి పోతున్నారు. ఈ రకంగా మోసం జరిగిందని తెలుసుకునే లోగా మరో రకమైన మోసం వెలుగు చూస్తోంది. కొన్ని రకాల మోసాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ‘పింక్ వాట్సాప్’ పేరుతో మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పింక్ వాట్సాప్‌ను క్లిక్ చేశామా? ఇక అంతే సంగతులు.
అత్యాధునిక ఫీచర్ల కోసం ‘పింక్ వాట్సాప్’ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ వస్తున్న సందేశాలపై అప్రమత్తత చాలా అవసరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ద్వారా జరుగుతున్న మోసాలను ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాజశేఖర్ రాజహరియా తెలిపారు. ఈ ‘పింక్ వాట్సాప్’ పేరిట సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న సందేశాలను క్లిక్ చేశామా.. మన ఫోన్‌లోని మెసేజ్‌ల నుంచి ఫోటోలు, కాంటాక్ట్స్ వంటి సమస్త సమాచారమంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయని రాజశేఖర్ రాజహరియా వెల్లడించారు.
వాట్సాప్ అధికారిక యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ వోయగర్ ఇన్ఫోసెక్ డైరెక్టర్ జితెన్ జైన్ పేర్కొన్నారు. పింక్ వాట్సాప్, గోల్డ్ వాట్సాప్ తదితర యాప్స్ అన్నీ నకిలీవని.. జితిన్ జైన్ తెలిపారు. నకిలీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments