‘పింక్ వాట్సాప్’తో జాగ్రత్త..

  • IndiaGlitz, [Tuesday,April 20 2021]

ఇంటర్నెట్ బాగా డెవలప్ అయ్యాక.. ప్రజానీకానికి పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాక ఏం చేయాలన్నా ఒక్క క్షణం ఆలోచించి చేయాల్సిందే. ఎందుకంటే ఎంతలా అయితే ఇంటర్నెట్ వృద్ధి చెందిందో అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు కూడా తెలివిమీరి పోతున్నారు. ఈ రకంగా మోసం జరిగిందని తెలుసుకునే లోగా మరో రకమైన మోసం వెలుగు చూస్తోంది. కొన్ని రకాల మోసాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ‘పింక్ వాట్సాప్’ పేరుతో మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పింక్ వాట్సాప్‌ను క్లిక్ చేశామా? ఇక అంతే సంగతులు.

అత్యాధునిక ఫీచర్ల కోసం ‘పింక్ వాట్సాప్’ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ వస్తున్న సందేశాలపై అప్రమత్తత చాలా అవసరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ద్వారా జరుగుతున్న మోసాలను ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాజశేఖర్ రాజహరియా తెలిపారు. ఈ ‘పింక్ వాట్సాప్’ పేరిట సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న సందేశాలను క్లిక్ చేశామా.. మన ఫోన్‌లోని మెసేజ్‌ల నుంచి ఫోటోలు, కాంటాక్ట్స్ వంటి సమస్త సమాచారమంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయని రాజశేఖర్ రాజహరియా వెల్లడించారు.

వాట్సాప్ అధికారిక యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ వోయగర్ ఇన్ఫోసెక్ డైరెక్టర్ జితెన్ జైన్ పేర్కొన్నారు. పింక్ వాట్సాప్, గోల్డ్ వాట్సాప్ తదితర యాప్స్ అన్నీ నకిలీవని.. జితిన్ జైన్ తెలిపారు. నకిలీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది.

More News

వేగంగా వస్తున్న ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ చిన్నారిని కాపాడిన పాయింట్స్ మ్యాన్..

కొన్ని స్టంట్స్ సినిమాల్లో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. అది జస్ట్ మూవీ కోసం.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేస్తేనే చూస్తున్న మనకు వెన్నుముక నిటారుగా అయిపోయి..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుంచి నైట్ కర్ఫ్యూ

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ వడ్డి ఓం ప్రకాశ్

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వడ్డి ఓం ప్రకాశ్ నారాయణకు కీలక పదవి లభించింది. ఫిల్మ్ జర్నలిస్ట్‌గా కొన్ని దశాబ్దాలుగా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపు లభించింది.

ఢిల్లీలో లాక్‌డౌన్ విధిస్తూ సీఎం కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలోనూ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి.

ఫేషియల్‌కని వెళ్లిన నటిని అందవిహీనంగా మార్చేసిన డాక్టర్..

ఆడవాళ్లు అందానికి ఎంత ప్రాధాన్యమిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నటీమణులైతే.. చాలా ప్రాధాన్యం ఇస్తారు.