‘పింక్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ డేట్ ఫిక్స్!

  • IndiaGlitz, [Tuesday,January 07 2020]

టాలీవుడ్ టాటా చెప్పేసి.. రాజకీయాల్లో రాణించాలని రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్.. జనసేన అంటూ పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి దూకాడు. అయితే సినిమాల్లో రాణించినంతగా రాజకీయాల్లో మాత్రం ఆయన రాణించకలేకపోయారు. ‘పింక్’ రీమేక్‌తో పవన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అబ్బే అదేం లేదే పవన్ రీమేక్ చేయట్లేదని చెబుతున్నప్పటికీ లోలోపల చాలా జరిగిపోతున్నాయని.. ఇప్పటికే రెమ్యునరేషన్, డేట్స్ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయని వార్తలు పెద్ద ఎత్తున వస్తుండటం.. ఈ వార్తలను ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్‌రాజు, పవన్ కూడా ఖండించకపోవడంతో పక్కా అని తేలిపోయింది.

డేట్ ఫిక్స్.. ఆ తర్వాతే రంగంలోకి పవన్!
ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పండుగ సీజన్‌ మొత్తం పూర్తయ్యాక షూటింగ్ షురూ చేయాలని దిల్ రాజు చిత్రబృందానికి సూచించగా అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ముందుగా పవన్ పాత్రకి సంబంధం లేని సన్నివేశాలను చిత్రీకరించాలని.. ఆ తర్వాత జనసేనాని రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. అంటే కాస్త అటు ఇటు ఫిబ్రవరి 14 పైన పవన్ షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. కాగా.. ఇప్పటికే హిందీ, తమిళ్‌లో ఈ సినిమా ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు.

గట్టిగానే రెమ్యునరేషన్!
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు పవన్ గట్టిగానే పారితోషికం పుచ్చుకున్నాడని తెలుస్తోంది. రూ. 50 కోట్ల వరకు పవన్.. రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు ఒప్పుకోవడమే పెద్ద గగనం.. మళ్లీ పారితోషికం విషయంలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గేది లేదని పవర్‌స్టార్ తేల్చేశారట. అందుకే జనసేనాని అడిగినంత ఇచ్చేయాలని దిల్ రాజు కూడా అనుకున్నారట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.!

More News

ఏపీలో మరోసారి చక్రం తిప్పనున్న కేసీఆర్!

ఏపీలో ఎన్నికలు ఎప్పుడు అయిపోయాయ్.. కేసీఆర్ అనుకున్నట్లుగానే వైఎస్ జగన్ పార్టీ గెలిచింది..

నిర్భయ దోషులకు డెత్ వారెంట్...

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో దోషులకు ఉరిశిక్షకు విధింపుకు హైకోర్టు తీర్పు వెలువరించంది.

రజనీ ‘దర్బార్’ రిలీజ్..: ఉద్యోగులకు బంపరాఫర్!!

టైటిల్ చూడగానే కాస్త ఆశ్చర్యంగా ఉంది.. ఆశ్చర్యపోయినా సరే మీరు వింటున్నది నిజమే.! తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు..

రంగస్థలం చూపిన దారిలో సుక్కు-బన్నీ సినిమా

సినిమా అంటే సింపుల్‌గా తీసేయడము కాదు. సినిమాతో పాటు ప్రేక్షకుడు నడవాలి. ఆ సినిమాలో లీనమవ్వాలి.

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు : పవన్

రాజధాని రైతులు ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన తెలియచేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని..