జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించండి: సుప్రీంలో పిటిషన్

ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖ పెను దుమారాన్నే రేపుతోంది. దీనిపై సీఎం పదవి నుంచి జగన్‌ను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు అయింది. జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ లేఖను విడుదల చేశారంటూ సీఎం జగన్‌పై న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జి.ఎస్. మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన వారిలో ఉన్నారు.

దాదాపు 30 క్రిమినల్‌ కేసులు సీఎం జగన్‌పై నమోదయ్యాయని పిటిషన్‌లో న్యాయవాదులు పేర్కొన్నారు. మనీలాండరింగ్‌ కేసు కూడా నమోదైందని జి.ఎస్.మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి వ్యక్తి కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేయడాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఐ, సీఎం జగన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చూపారు.

న్యాయవ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నించారని పిటిషన్‌లో న్యాయవాదులు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. కాబట్టి వైఎస్ జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్ మరో రెండు, మూడు రోజుల్లో కానీ.. లేదంటూ దసరా అనంతరం ఈ నెల 26న పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

కాగా.. ఏపీ సీఎం జగన్ కనివినీ ఎరుగని చర్యకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఏకంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తి ఎన్వీ రమణ.. రాష్ట్ర హైకోర్టును ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ.. దానికి తగిన ఆధారాలున్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ రాశారు. ఈ లేఖ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఏపీలో శాసన వ్యవస్థకు, ప్రభుత్వానికి నడుమ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కోల్డ్ వార్ జరుగుతోంది. తాజాగా జస్టిస్ రమణపై సీఎం జగన్ బహిరంగ యుద్ధం ప్రకటించారు. నేడు జగన్‌కి కౌంటర్‌గా న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

More News

హీరోయిన్‌తో బోండా ఉమ అంటూ పిక్స్.. పోలీసులకు ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడు ఎలా దొరుకుతారా? అని అధికార పక్షం నేతలు ఎదురు చూస్తూ ఉంటారు.

ఒకే కుటుంబానికి చెందిన 9 మంది గల్లంతు..

వర్షాలు బీభత్సానికి హైదరాబాద్ సహా చుట్టు పక్కల జిల్లాల్లో ఆస్తి నష్టంతో పాటు... ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది.

విడుదలకి సిద్దమైన 'వ‌ల‌స‌'

కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకం పై యెక్కలి రవీంద్ర బాబు నిర్మాణ సారథ్యంలో

'ట్రు` మూవీ టైటిల్ లోగో విడుద‌ల‌!

గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ నూతన నిర్మాణ సంస్థలో గుణశేఖర్, సురేందర్ రెడ్డి మరియు వై వి ఎస్ చౌదరి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్

డిఫ‌రెంట్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ `మాయ‌` ఫ‌స్ట్‌లుక్‌కి సూప‌ర్ రెస్పాన్స్‌

ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం `మాయ`. సంధ్య బయిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ పోషించ‌గా,