గిన్నిస్‌కు రెండేళ్ల చిన్నారి చిత్రం 'పీహు'
Send us your feedback to audioarticles@vaarta.com
మైరా విశ్వకర్మ అనే రెండేళ్ల చిన్నారి నటించిన చిత్రం 'పీహు'. రూ.45 లక్షలతో నిర్మితమైన ఈ చిత్రం నేషనల్ అవార్డ్ విన్నర్ వినోద్ కాప్రి తెరకెక్కిస్తున్నారు. సిద్ధార్థ్ రాయ్ కపూర్, శిల్పా జిందాల్, రోనీ స్క్రూవాలా నిర్మాతలు. నవంబర్ 16న సినిమా విడుదల కానుంది.
రెండేళ్ల చిన్నారి నటించిన ఏకైక చిత్రంగా ఈ చిత్రాన్ని గిన్నిస్‌బుక్‌లో చేర్చడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులకు వచ్చే పీడకల అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంట్లోని తల్లి చనిపోయిందని తెలియని చిన్నపిల్ల ఏం చేసింది? అమ్మ ఎప్పుడు లేస్తుందా? అని ఎదురు చూసే ఆ పసిపాప చివరకు ఏం చేసిందనేదే కథ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments