కరోనా ఎఫెక్ట్: పందులను ప్రాణంతోనే పాతేస్తున్నారు!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. చైనా వాళ్లంటే ప్రపంచమంతా హడలిపోయే పరిస్థితి నెలకొంది. సాధారణ జలుబు, దగ్గులా ప్రారంభయ్యే ఈ వైరస్ లక్షణాలు కొద్ది వ్యవధిలోనే ముదిరి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. అందుకే ప్రపంచ దేశాలు చైనీయులను అంత తేలిగ్గా తమదేశంలో అడుగు పెట్టనివ్వడంలేదు. చైనా నుంచే కాదు ఇతరదేశాలు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఇండియాలో అడుగుపెట్టనిస్తున్నారు. అయితే.. ఈ వ్యాధులు పందులు, గబ్బిళాలు, పాముల ద్వారా వస్తోందని ఇప్పటికే పలు పరిశోదనల్లో నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
ప్రాణంతోనే పాతేస్తున్నారు!
కరోనా దెబ్బతో.. చైనాలో పందులు కనిపించకూడదని ఇందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో దేశంలో ఉన్న పందులను వాహనాల్లో నిర్మానుష్య ప్రాంతానికి తరలించేస్తున్నారు. అనంతరం అక్కడ గోతులు తీసి ఆ పందులను సజీవంగా అందులో వేసి పాతేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పందులు ఊపిరాడక వాటంతట అవే చనిపోతాయట. బురదలో లేదా వాటర్‌లో అయినా పందులు ఎక్కువ సేపు ఉండగలవు కానీ.. ఇలా భూమి లోపల మాత్రం అస్సలు ఉండలేవ్. ఒక్కొక్కటి చంపుకుంటూ పోతే జరిగే పని కాదని తెలుసుకున్న అక్కడి ప్రభుత్వం.. ఎక్కడికక్కడ పందులను వేటాడి పట్టుకుని ఇలా వాహనాల్లో తరలించేసి పాతి పెట్టేస్తున్నారు.
నిజమేనా!?
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వేలాది పందులు ఓ పెద్ద గోతిలోనికి జేసీబీ వాహనాల ద్వారా తోసేసి అనంతరం మట్టి వేసి వాటిని పాతేస్తున్నారు. ఈ వీడియో చూసిన జనాలు ముక్కున వేలుసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కరోనా నడుస్తోంది గనుక పాత వీడియోను వైరల్ చేస్తున్నారో లేదా ఒరిజనల్ వీడియోనా..? అనేది అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేత వరకూ వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout