పిక్ టాక్: పూజా హెగ్డే యోగాసనాలు.. ప్రతి భంగిమలో హాట్ నెస్
Send us your feedback to audioarticles@vaarta.com
యువతలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న నటి పూజా హెగ్డే. టాలీవుడ్ లో డీజే చిత్రం నుంచి పూజా దశ మారిపోయింది. ప్రస్తుతం పూజా హెగ్డే వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో పూజా హెగ్డే చాలా యాక్టివ్.
ఏ సందర్భం వచ్చినా పూజా హెగ్డే సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు షేర్ చేస్తూ ఉంటుంది. 30 ఏళ్ల పూజా హెగ్డే ఇంత నాజూగ్గా, సెక్సీగా ఉండడానికి కారణం ఆమె జిమ్ కసరత్తులు మాత్రమే కాదు. ఫిట్ నెస్ కోసం పూజా హెగ్డే రెగ్యులర్ గా యోగ కూడా చేస్తూ ఉంటుంది.
నేడు ఇంటర్నేషనల్ యోగా డే. ఈ సందర్భంగా పూజా హెగ్డే అభిమానులు ఆమె వివిధ భంగిమల్లో యోగాసనాలు చేస్తున్న ఫ్యాన్ మేడ్ పిక్ తయారు చేశారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూజా హెగ్డే ప్రతి భంగిమలో హాట్ యోగా ఫోజులతో ఆకట్టుకుంటోంది.
ఈ పిక్ ని పూజా కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. అభిమానులకు పూజా హెగ్డే యోగా డే శుభాకాంక్షలు తెలిపింది. సినిమాల విషయానికి వస్తే పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ సరసన 'రాధే శ్యామ్' చిత్రంలో నటిస్తోంది. అలాగే అఖిల్ అక్కినేనికి జోడిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ లో కూడా నటిస్తోంది. గత ఏడాది పూజా హెగ్డే 'అల వైకుంఠపురములో' చిత్రంతో భారీ విజయాన్ని బుట్టలో వేసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com