పిక్ టాక్ : కూతుర్ని కౌగిలించుకుని నిద్రలోకి జారుకున్న మహేష్

  • IndiaGlitz, [Thursday,June 03 2021]

మహేష్ బాబు వెండితెరపై ఎంతటి సూపర్ స్టార్ అయినా తన ఫ్యామిలీ విషయంలో మాత్రం ఓ తండ్రిగా, భర్తగా చాలా సింపుల్ గా ఉంటాడు. తన పిల్లలతో తాను కూడా పిల్లాడిలా మారిపోతాడు. కుటుంబానికి మహేష్ అంత ప్రాధాన్యత ఇస్తాడు. షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్లడం వారికోసం ప్రత్యేకంగా టైం కేటాయించడంలో మహేష్ తర్వాతే ఎవరైనా.

మహేష్ సతీమణి నమ్రత తరచుగా తన కుటుంబ విశేషాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా నమ్రత ఇన్స్టాగ్రామ్ లో క్యూట్ ఫోటో షేర్ చేసింది. చూడముచ్చటగా ఉన్న ఆ పిక్ నెటిజన్లని ఆకర్షిస్తోంది. మహేష్ బాబు కుర్చీలో కూర్చుని ఉండగా అతడి ఒడిలో ముద్దుల కూతురు సితార ఒదిగిపోయి నిద్రిస్తోంది. మహేష్ తన కుమార్తెని కౌగిలించుకుని నిద్రలోకి జారుకున్నాడు.

ఇదీ చదవండి: సమంత అభిమానుల కౌంటర్ అటాక్ షురూ..

ఈ అందమైన ఫోటోకి మహేష్ అభిమానులు క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తన కూతురంటే మహేష్ కి ఎంత ప్రాణమో గతంలోనే పలు ఫొటోస్ లో చూశాం. 'ఉదయాన్నే తప్పనిసరిగా కౌగిలించుకోవాలి. లేకుంటే నిద్ర లేవరు' అని నమ్రత కామెంట్ పెట్టింది.

సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కార్ వారి పాట' అనే చిత్రంలో నటిస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఓ చిత్రం రానుంది. ఆ తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రానికి కమిటై ఉన్నాడు.