కరోనాతో ప్రముఖ ఫార్మాకి కంపెనీకి చెందిన తండ్రీకొడుకుల మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ ఫార్మా పరిశ్రమ ఓనర్‌తో పాటు ఆయన కుమారుడు కరోనా కారణంగా మరణించారు. వీరికి హిమాయత్‌నగర్‌లో ఒక మెడికల్ షాపుతో పాటు.. రూ.500 కోట్ల టర్నోవర్ కలిగిన ఫార్మా పరిశ్రమ ఉంది. కాగా వీరి కుటుంబంలో మరో ఇద్దరు నగరంలో కార్పొరరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి మెడికల్ స్టోర్‌ను 1985లో ప్రారంభించారు. కాగా అప్పటి నుంచి ఈ మెడికల్ స్టోర్‌లో 20 మందికి పైగా అంకిత భావంతో పని చేసే సిబ్బంది ఉండటంతో వారు తమ ఫార్మా కంపెనీపై దృష్టి సారించారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మెడికల్ స్టోర్‌లో విపరీతమైన రద్దీ ఉంటోంది. స్టోర్ ఎలా నడుస్తోంది తదితర అంశాలను పర్యవేక్షించేందుకు కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు స్టోర్‌కి వెళుతుంటారు. ఈ క్రమంలోనే వారు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. దీంతో పరిస్థితి విషమించి రెండు రోజుల వ్యవధిలోనే తండ్రీకొడుకులు మరణించినట్టు తెలుస్తోంది. తండ్రీ కొడుకుల మృతితో మెడికల్ షాపు యజమానులు, ఫార్మా పరిశ్రమల యజమానుల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments