పేట తెలుగు వర్షన్.. జనవరి 10న విడుదల..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత అశోక్ వల్లభనేని పేట తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈయన గతంలో విజయ్ సర్కార్.. మణిరత్నం నవాబ్ సినిమా హక్కులను తెలుగులో తీసుకున్నారు. ఇప్పుడు పేట హక్కులను 21 కోట్లకు సొంతం చేసుకున్నారు. భారీ పోటీ మధ్య ఈ డీల్ సొంతం చేసుకున్నారు అశోక్. ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నారు ఈ నిర్మాత. తెలుగులో ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత అశోక్.
పేట సినిమా రజినీకాంత్, కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వస్తుంది. సూపర్ స్టార్ కు తెలుగులో ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాకు హెల్ప్ కానుంది. రజిని ఈ సినిమా కోసం చాలా మేకోవర్ అయ్యారు. ఇదివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఇందులో కొత్తగా ఉన్నారు సూపర్ స్టార్. సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శశికుమార్, మేఘా ఆకాష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పేట సినిమాతోనే దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తుండగా.. సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. జనవరి 10న విడుదల కానుంది పేట.
నటీనటులు: సూపర్ స్టార్ రజినీకాంత్, సిమ్రాన్, త్రిష, నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శశికుమార్, మేఘా ఆకాష్..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com