అల్లు అరవింద్, దిల్‌రాజు, యు.వి.క్రియేషన్స్ కుక్కలా..పందులా
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతలుగా రాణిస్తున్న అల్లు అరవింద్, దిల్‌రాజు, యు.వి.క్రియేషన్స్ వారిని నిర్మాత అశోక్ వల్లభనేని కుక్కలు అంటూ మాట్లాడాడు. రజనీకాంత్ 'పేట' చిత్రాన్ని తెలుగులో అశోక్ వల్లభనేని విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. జనవరి 10న సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ "యువీ క్రియేషన్స్, దిల్‌రాజు, అల్లు అరవింద్ వంటివారందరూ థియేటర్లతోనే పుట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. థియేటర్లు ఇవ్వడానికి వీరికేంటి నొప్పి? ఇలాంటి కుక్కలకు బుద్ధి చెప్పి ప్రభుత్వాలు మాకు థియేటర్లను ఇచ్చేలా చేయాలి. నయీమ్‌లాంటి వారిని చంపేశారు. ఇలాంటి వారిని ఎందుకు షూట్ చేయరు? కేసీఆర్‌గారు, చంద్రబాబుగారు ఆలోచించాలి" అంటూ మాట్లాడారు.
మరో నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ "థియేటర్ మాఫియా... మాఫియా డాన్ల కన్నా దారుణాతి దారుణంగా ఉంది. ముగ్గురు నలుగురు వాళ్లు చేసే సినిమాలను మాత్రమే విడుదల చేస్తున్నారు. సంక్రాంతికి ఆరు నుంచి ఏడు సినిమాలు విడుదలైన సందర్భాలు మన దగ్గర ఉన్నాయి. చూడాలనుకునే ప్రేక్షకులు ఉన్నారు. అయితే కొన్ని ఏరియాల్లో కేవలం ఒకటీ, రెండు సినిమాలకే థియేటర్లను కేటాయించారు. అదొక మాఫియాలాగా తయారైంది. అలాంటి మాఫియా ఎండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. టెక్నీషియన్లను వాళ్లు బతకనివ్వడం లేదు. కొత్త వాళ్లని రానిచ్చే పరిస్థితి లేదు.
తెలంగాణలో కేసీఆర్‌గారికి, కేటీఆర్‌గారికి, ఆంధ్రలో చంద్రబాబునాయుడుగారికి చెప్తాం. మాఫియాకు కూడా కులం, మతం, ప్రాంతం లేదు. తెలంగాణ ఆయన తెలంగాణలోనూ, వైజాగ్‌లోనూ మాఫియా చేస్తాడు. వాళ్ల సినిమాలే ఆడాలని చూస్తున్నారు. మిగిలిన వాళ్లనే తొక్కేస్తున్నారు. ఇంకే టెక్నీషియన్‌ని ఎదగనివ్వడం లేదు. ఇది మంచిది కాదు. వాళ్ల సినిమాలు మాత్రమే ఉండాలనుకోవడం మంచిది కాదు. దయచేసి మీరు విజ్ఞప్తి అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. వార్నింగ్ అనుకోండి. చాలా మంది ఆకాశం నుంచి ఆకాశంలోనే పోయారు.
మీరు కూడా పోతారమ్మా... కాస్త తెలుసుకుని పద్ధతిగా ఉండండి. ఇక సినిమా గురించి వస్తే ప్రతి సినిమా ఆడాలనే కోరుకుంటాం. కానీ ప్రేక్షకుడు బావున్న సినిమాలనే ఆడిస్తాడు. పదో తారీఖు ఎన్టీఆర్ విడుదలైన తర్వాత నుంచి అదీ. పేటా ఆడుతాయి. రజనీకాంత్‌గారు రాఘవేంద్రస్వామి కాళ్లకు, బతికున్న ఎన్టీఆర్ కాళ్లకు మాత్రమే దణ్ణం పెట్టేవాడు. ఎన్టీఆర్ బయోపిక్ చరిత్ర సృష్టించడం ఖాయం. పేటా చరిత్ర సృష్టించడం ఖాయం. మిగిలిన వాళ్లు చూసుకోండి.. మీ ఇష్టం. పందులు గుంపులుగా వస్తాయమ్మా.. సింహం సింగిల్‌గా వస్తుంది. మీ అరాచకాలను పైన దేవుడు చూస్తాడు. ఇకనైనా మనుషులుగా మారండి" అంటూ కామెంట్స్ చేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout