అజిత్ ‘‘వలిమై’’ థియేటర్‌పై పెట్రోల్ బాంబులతో దాడి, ఉద్రిక్తత
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ సినిమా కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తారు. తాజాగా ఆయన నటించిన ‘వలిమై’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా వున్నాయి. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు యువ హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హ్యూమా క్యురేషి హీరోయిన్ గా నటించింది.
వలిమై విడుదల నేపథ్యంలో తమిళనాట పండుగ వాతావరణం నెలకొంది. అజిత్ అభిమానులు వూరు వాడా సంబరాలు జరుపుతున్నారు. అయితే కోయంబత్తూరులో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. గంగవల్లి మల్టిప్లెక్స్ థియేటర్ వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా.. బైక్ పై వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబ్‌లతో దాడి చేశారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరూ ఈ సంఘటనలో గాయపడలేదు.
అక్కడే ఉన్న అజిత్ అభిమానులు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్స్ వద్ద తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ అభిమానులు మాత్రం వీటిని లెక్కచేయకుండా కటౌట్లు పెట్టడం, పాలాభిషేకాలు చేయడం చేస్తుంటారు. అటు ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన వలిమై చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com