జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్
- IndiaGlitz, [Wednesday,October 25 2017]
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జులై 1 నుండి జీఎస్టీ ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పెట్రోలియం ఉత్పత్తులను మాత్రం జీఎస్టీ కిందకు తీసుకురాకపోవడం పై చాలా మంది వినియోగదారులు ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.
ఈ విషయం పై ఎట్టకేలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పెదవి విప్పారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, రాష్ర్టాలే వ్యతిరేకిస్తున్నాయి. రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం ఉంది అని ఆయన స్పష్టంచేశారు.
పెట్రోల్, డీజిల్ రేట్లు ఈ మధ్య కాలంలో భారీగా పెరగడంతో, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతోపాటు రాష్ర్టాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని కేంద్రం కోరింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఇప్పటికే వ్యాట్ ను తగ్గించాయి.
పెట్రోలియం ఉత్పత్తులను గనుక జీఎస్టీకి కిందకు తీసుకువస్తే దాదాపు సగం ధరలు తగ్గే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పై వినియోగదారులంతా గంపెడంత ఆశతో ఎదురుచూస్తున్నారు.