పీటర్ హెయిన్స్ దర్శకత్వం...

  • IndiaGlitz, [Tuesday,May 09 2017]

సౌతిండియా స్టార్ యాక్ష‌న్ కంపోజ‌ర్ పీట‌ర్ హెయిన్స్ త్వ‌ర‌లోనే మెగాఫోన్ ప‌ట్ట‌నున్నారు. మ‌గ‌ధీర‌, సెవెన్త్ సెన్స్‌, బాహుబ‌లి 1, మ‌న్యంపులి స‌హా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు యాక్ష‌న్స్ ఎపిసోడ్స్‌ను కంపోజ్ చేసిన పీట‌ర్ హెయిన్స్ ద‌ర్శ‌క‌త్వం చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకున్నాడ‌ట‌. ఆయ‌న క‌ల త్వ‌ర‌లోనే నేర‌వేర‌నుంద‌ట‌.

మ‌న్యం పులి సినిమా స‌మ‌యంలో మోహ‌న్‌లాల్‌కు త‌న క‌థ‌ను వినిపించాడ‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో మోహ‌న్‌లాల్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే పీట‌ర్ హెయిన్స్ క‌థలో యాక్ష‌న్ పార్ట్‌కు కూడా ఎమోష‌న్స్‌కు పెద్ద పీట వేశాడ‌ట‌. మ‌రి సినిమా ఎప్ప‌టి నుండి స్టార్ట్ అవుతుందో చూడాలి.