తెలుగు తమ్ముళ్లూ.. జనం ఛీ కొట్టినా మారరా!

  • IndiaGlitz, [Sunday,August 04 2019]

జనం ఛీకొట్టినా తెలుగు తమ్ముళ్లలో మార్పురావడం లేదని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. శనివారం రాత్రి మీడియాతో మాట్లాడిన నాని.. వయసు పెరిగే కొద్దీ చంద్రబాబు ఆలోచన పరిజ్ఞానం మసకబారుతోందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ గురించి మాట్లాడేడప్పుడు దేవినేని నాని లాంటి నోరు అదుపులో పెట్టుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేవినేని ఉమకు పదవి పోయినా మదం దిగలేదని.. ప్రజలు అధికారం నుంచి దించినా అహంకారం తగ్గలేదని విమర్శలు గుప్పించారు.

బందరు పోర్టుపై మంత్రి క్లారిటీ!

బందరు పోర్టును తెలంగాణకు ఇస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి రాజధానిలో పదేళ్ల హక్కుల్ని వదిలేసి.. మనకున్న హక్కుల్ని కేసిఆర్‌కు అమ్మేసి కేసుల భయంతో చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారా లేదా..?. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తాం. రాసి పెట్టుకోండి అని గొప్పలు చెప్పిన బాబు ఏం చేశారు?. పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల పేరుతో భారీగా దండుకున్నారు. అధికారం కోల్పోయినా వారి బలుపు తగ్గలేదు. దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. రాజకీయంగా బతికున్నాని చెప్పుకోవడానికే బందరు పోర్టుపై కొల్లు రవీంద్ర తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రెండు, ప్రొక్లెయిన్‌లు, జేసీబీ, బోర్‌వెల్‌ డ్రిగ్గింగ్‌ మిషన్లతో పోర్టు కడతారా..?. ఆ మిషన్లన్నీ బందరు నుంచి అద్దెకు తీసుకొచ్చినవే అని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు.

పండిత పుత్రా..!

రహస్య జీవోలు అంటూ జీవోలు డౌన్‌ లోడ్‌ చేయడం రాని లోకేశ్ లాంటి వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారు పండితపుత్ర లోకేశ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఎవరో రాసిచ్చినవి ట్విట్టర్లో పెట్టడం సరికాదు. ఐదేళ్లుగా మచిలీపట్నంను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు వేసిన శంకుస్థాపన రాయి తప్ప ఇక్కడ మరేమీ కనిపించదు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు. చంద్రబాబు, లోకేశ్ పబ్లిసిటీ కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. బందరు పోర్టులో గత ఐదేళ్ల కాలంలో చిటికెడు మట్టి పని కూడా జరగలేదు అని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

పోలవరం పనులు నవయుగ కంపెనీ చేయకపోతే మేమే చేపడతామని ఈ సందర్భంగా మంత్రి తేల్చిచెప్పారు. పోలవరం బాధ్యత రాష్ట్రానిదేనంటూ కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ చేసిన వ్యాఖ్యలను చేయడం బాధాకరమన్నారు. షెకావత్ ఓ కేంద్రమంత్రిగా కాకుండా బీజేపీ నేతగా ఆ వ్యాఖ్యలు చేశారని పేర్ని నాని విమర్శలు గుప్పించారు.

More News

పీసీసీ చీఫ్‌గా రఘువీరా ఔట్.. ‘పళ్లం’కు పగ్గాలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే.

రియల్ హీరో అనిపించుకున్న ‘రేసుగుర్రం’ విలన్!

ఇండియాలో చాలా చిత్రవిచిత్రమైన రాజకీయ నేతలను మనం చూసే ఉంటాం.. కనీసం వార్తల్లో అయినా ఫలానా నేత ఇలా చేశారు..

పునర్నవీని డేట్‌కు పిలిచిన రాహుల్.. రియాక్షన్ ఇదీ..!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-03 ఇప్పటి వరకూ గొడవలతో అరుపులతో ఎపిసోడ్ ముగిసిపోయేది. అయితే శుక్రవారం మాత్రం ఈ షో చూసిన వాళ్లంతా కంటతడిపెట్టుకున్నారు.

తీన్మార్ సావిత్రి ప్రేమ కథ.. కన్నీటి ప్రవాహమే!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-03 ఇప్పటి వరకూ గొడవలతో అరుపులతో ఎపిసోడ్ ముగిసిపోయేది. అయితే శుక్రవారం మాత్రం ఈ షో చూసిన వాళ్లంతా కంటతడిపెట్టుకున్నారు.

టీడీపీకి దేవినేని రాజీనామా.. జగన్ సమక్షంలో వైసీపీలోకి!

తెలుగు యువత అధ్యక్షుడు, మంత్రిగా కొడాలి నానినే ఢీ కొన్న నేత దేవినేని అవినాష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.!