‘ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. జగన్ గుండె ధైర్యానికి జేజేలు’
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చూపించారని సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ గుండె ధైర్యానికి జేజేలు పలకాల్సిందేనని.. 54 వేల ఆర్టీసీ కుటుంబాల తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అలాగే జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కాబోతున్న ఆర్టీసీ కార్మికులకు ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ఏపీ ప్రభుత్వంలో విలీనం చేయాలన్న సుదీర్ఘ కాల కోర్కేను జగన్ 2020 జనవరి 1వ తేదీన నెరవేర్చబోతున్నారు. ఆర్టీసీ కార్మికుల కలను సాకారం చేసే రోజు చరిత్రలో నిలిచిపోబోతోందన్నారు.
దేశ చరిత్రలో జగన్ ఒక్కరే..!
‘జనవరి 1 నుంచి 50 వేల పైచిలుకు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మొదటి రోజు మొదలుకాబోతుంది. వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వైయస్ జగన్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా, ఓ సామాన్య పౌరుడిగా ఆర్టీసీని విలీనంచేసిన జగన్ గుండెధైర్యానికి నిజంగా జేజేలు పలకాల్సిన పరిస్థితి. నాడు చంద్రబాబు ఆర్టీసీ విలీనం అసాధ్యమన్నారు. మీ కోర్కెలకు అంతు లేకుండా పోయిందని మాట్లాడారు. తన పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల కష్టాలు విన్న వైయస్ జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీనిపరిరక్షించేందుకు ఉద్యోగులందరినీ కూడా మెర్జర్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఆర్టీసీ విలీనంపై జగన్ కంకణం కట్టుకుని ప్రయత్నాలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాట కోసం, ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా రూ.3600 కోట్ల జీత భత్యాల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం బుజానికి ఎత్తుకుంది. ఇలాంటి నిర్ణయం దేశ చరిత్రలో జగన్ ఒక్కరే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీనం సాధ్యంకాదని చాలా మంది నిపుణులు, మేధావులు అన్నప్పటికీ కూడా జగన్ సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లారు. 54 వేల ఆర్టీసీ కుటుంబాల తరఫున సీఎం వైయస్ జగన్‌కు పాదాభివందనాలు చేస్తున్నాను’ అని మంత్రి పేర్ని నాని తెలిపారు.
వాట్ నెక్స్ట్ కేసీఆర్!?
కాగా ఆర్టీసీ విలీనం చేయడం అస్సలు వీలు కాదని... అది జరిగే పని కాదని తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఏపీలో ఇలా చేస్తుండటంతో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఉద్యమించడం.. ఆ తర్వాత మళ్లీ విధుల్లో చేరడం జరిగింది. మరి తాజా ప్రకటనతో తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుందో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవన్నీ అటుంచితే.. ఆర్టీసీ అస్సలు విలీనం చేసే పరిస్థితి లేదని.. జగన్ కూడా అందుకు సంబంధించి కమిటీ వేశారని ఒకానొక సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరి ఎల్లుండి నుంచి.. కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఎలా రియాక్ట్ అవుతారో..? ఏంటో మరి.!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments