నేను తప్పు మాట్లాడితే మీ బూటు విసరండి!: నాని
Send us your feedback to audioarticles@vaarta.com
నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ ప్రకటనతో అమరావతి ప్రాంతంలో రైతులు రాస్తారోకోలు, ర్యాలీకి దిగారు. ఈ క్రమంలో ఈ రాజధాని అంశంపై తాడో పేడో తేల్చేందుకు గాను శుక్రవారం నాడు ఏపీ కెబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని తరలింపుతో పాటు పలు కీలక విషయాలపై నిశితంగా చర్చించారు. సుమారు 2:15 గంటలు పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భేటీ అనంతరం సమావేశంకు సంబంధించి వివరాలను సచివాలయంలో మీడియా మీట్ పెట్టి సమాచార శాఖమంత్రి పేర్ని నాని వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిశితంగా వివరాలు తెలిపారు. ఈ క్రమంలో మీడియా మిత్రులు సంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
ప్రశ్న : శాంతి భద్రతల విషయంలో సీఎం సీపీఆర్వోను కూడా బయట ఆపేస్తున్నారు ప్రభుత్వం ఏమైనా బయపడిందా..? అని మీడియా మిత్రులు మంత్రి పేర్ని నానిని ప్రశ్నించారు. ఇందుకు ఆయన చాలా లాజిక్‌గా సమాధానం ఇచ్చారు.
మీ బూటుతో కొట్టండి!
‘రాష్ట్రంలో శాంతి భద్రతలు చూడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటుంది. పరిస్థితులను అనుగుణంగా పోలీసు శాఖ చూసుకుంటుంది. బాధ్యత మేరకే వారు ప్రవర్తిస్తారు. అంతేకానీ.. నేను చెప్పినట్లు పోలీస్ డిపార్ట్‌మెంట్ వినదు కదా. నేను మంత్రిగా ఈ మధ్యనే వచ్చాను.. అన్నీ తెలిసిన మీరే (మీడియా) ఇలా మాట్లాడితే ఎలాగండి..?. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నా చొక్కా పట్టుకోండి. చాలా మంది విలేకర్లు తప్పుమాట్లాడితే పెద్ద పెద్దోళ్ల మీద బూటు విసురుతుంటారు. నేను తప్పు మాట్లాడుంటే మీ బూటు విసరండి’ అని మంత్రి నాని చమత్కరించారు. నాని మాట్లాడుతున్నంత సేపు.. మీడియా మిత్రులు పగలబడి నవ్వారు. అనంతరం పలు ప్రశ్నలు మీడియా మిత్రులు సంధించగా మంత్రి సమాధానమిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments