జగన్ పాలన చూసి ఓర్వలేక ఈ దుశ్చర్య!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు అండ, ఆర్థికబలంతో నడిచే పత్రికలు, టీవీ చానళ్లు ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నాయని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. గురువారం సాయంత్రం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. చంద్రబాబు, పచ్చ మీడియా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. జగన్ వెంట రాష్ట్ర ప్రజలు, పైన మంచి చేయాలనే భగవంతుడు ఉన్నాడని ఆయన చెప్పుకొచ్చారు. పదేళ్లుగా ప్రజల కోసం సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ చేసిన ప్రజా పోరాటాలు ఉన్నాయన్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేసిన జగన్కు రాష్ట్ర ప్రజలు 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాల్లో గెలిపించి ముఖ్యమంత్రిని చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఒంటరిగా, 50 శాతం ప్రజల మద్దతుతో గెలిచిన ఏకైక పార్టీ వైసీపీనే అని మంత్రి స్పష్టం చేశారు.
టీడీపీ పార్టీ అండదండలతో..!
‘అయితే వైసీపీ అంటే గిట్టని మీడియా ఎన్ని జోకులు వేసిన, ఎన్ని హాస్య కథనాలు రాసినా మా ప్రక్రియ, మా నాయకుడి పారదర్శక పాలనలో ఒక్క ఇరిగేషన్ టెండర్లోనే రూ.750 కోట్లు ఆదా చేసింది. గడిచిన ప్రభుత్వం జరిగిన లక్షల కోట్ల అవినీతి చేసింది. పచ్చమీడియా చలోక్తులు, ఓర్వలేని తనంలో ఎన్ని కట్టుకథలు రాసినా.. సీఎం జగన్ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రజలకు ఏమి ఇవ్వాలని అనుకుంటున్నారో.. ప్రతి పనిని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అండదండలతో, ఆర్థికబలంతో నడిచే పత్రికలు, టీవీలు ఏరకంగా ప్రభుత్వంపై బురదజల్లాలి.. కట్టు కథనాలు, విషం చిమ్మే వార్తలు రాస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను మానసికంగా కుంగదీయాలి.. పాలన సజావుగా సాగకుండా ఉండాలని తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఇదేనా జర్నలిజం విలువలు.. ?’ అని మంత్రి సూటి ప్రశ్న సంధించారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు, మీడియా సంస్థల అధినేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com