జగన్‌ పాలన చూసి ఓర్వలేక ఈ దుశ్చర్య!

  • IndiaGlitz, [Friday,October 18 2019]

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు అండ, ఆర్థికబలంతో నడిచే పత్రికలు, టీవీ చానళ్లు ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నాయని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. గురువారం సాయంత్రం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. చంద్రబాబు, పచ్చ మీడియా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. జగన్‌ వెంట రాష్ట్ర ప్రజలు, పైన మంచి చేయాలనే భగవంతుడు ఉన్నాడని ఆయన చెప్పుకొచ్చారు. పదేళ్లుగా ప్రజల కోసం సీఎం జగన్‌ నాయకత్వంలో వైసీపీ చేసిన ప్రజా పోరాటాలు ఉన్నాయన్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేసిన జగన్‌కు రాష్ట్ర ప్రజలు 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాల్లో గెలిపించి ముఖ్యమంత్రిని చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఒంటరిగా, 50 శాతం ప్రజల మద్దతుతో గెలిచిన ఏకైక పార్టీ వైసీపీనే అని మంత్రి స్పష్టం చేశారు.

టీడీపీ పార్టీ అండదండలతో..!

‘అయితే వైసీపీ అంటే గిట్టని మీడియా ఎన్ని జోకులు వేసిన, ఎన్ని హాస్య కథనాలు రాసినా మా ప్రక్రియ, మా నాయకుడి పారదర్శక పాలనలో ఒక్క ఇరిగేషన్‌ టెండర్‌లోనే రూ.750 కోట్లు ఆదా చేసింది. గడిచిన ప్రభుత్వం జరిగిన లక్షల కోట్ల అవినీతి చేసింది. పచ్చమీడియా చలోక్తులు, ఓర్వలేని తనంలో ఎన్ని కట్టుకథలు రాసినా.. సీఎం జగన్‌ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రజలకు ఏమి ఇవ్వాలని అనుకుంటున్నారో.. ప్రతి పనిని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అండదండలతో, ఆర్థికబలంతో నడిచే పత్రికలు, టీవీలు ఏరకంగా ప్రభుత్వంపై బురదజల్లాలి.. కట్టు కథనాలు, విషం చిమ్మే వార్తలు రాస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను మానసికంగా కుంగదీయాలి.. పాలన సజావుగా సాగకుండా ఉండాలని తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఇదేనా జర్నలిజం విలువలు.. ?’ అని మంత్రి సూటి ప్రశ్న సంధించారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు, మీడియా సంస్థల అధినేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే మరి.

More News

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్‌ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రెండు వారాలుగా సమ్మెకు దిగిన తెలిసిందే. తమ డిమాండ్స్ నెరవేర్చాల్సిందేనని కార్మికులు..

బుల్లితెర రంగంలో విషాదం.. ‘బుల్లి బాలయ్య’ కన్నుమూత

తెలుగు రాష్ట్రాల్లో జ్వరాలు ప్రబలిన సంగతి తెలిసిందే. ఆర్ఎంపీ ఆస్పత్రి చూసినా.. ఎంబీబీఎస్ ఆస్పత్రి చూసిన జ్వరాలొచ్చిన జనాలతో కిటకిటలాడుతున్నాయి.

'విజిల్‌' అక్టోబ‌ర్ 25న రిలీజ్

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం `విజ‌య్‌`.

'జార్జ్ రెడ్డి' నైజాం రైట్స్ సొంతం చేసుకున్న గ్లోబల్ సినిమాస్

ట్రైలర్ తో అంచనాలు పెంచిన జార్జిరెడ్డి సినిమాకు బిజినెస్ పరంగా మంచి ఆఫర్లు వస్తున్నాయి..ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ ను ఇటీవలే అభిషేక్ పిక్చర్స్

'సాహో' నిర్మాత‌ల‌పై కేసు

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, సుజిత్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `సాహో`. యు.వి.క్రియేష‌న్స్ నిర్మించిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుద‌లైంది.